బాలకృష్ణ తదుపరి చిత్రంలో హీరోయిన్గా అనంతపురం అమ్మాయి..

నందమూరి నరసింహం బాలకృష్ణ 108వ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.. అయితే ఈ చిత్రంలో అనంతపురం కు చెందిన అమ్మాయి హీరోయిన్గా నటించిన ఉందని వార్తలు వినిపిస్తున్నాయి..

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న షూటింగ్ తొందర్లోనే ప్రారంభం కానుంది ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు కాక హరీష్ రెడ్డి సాహు గారి పాటి నిర్మాతలు వ్యవహరిస్తున్నారు.. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ అయ్యిందనే వార్తలు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి. అనంతపురంకు చెందిన అమ్మాయి ప్రియాంక జవాల్కర్‌ను అనీల్ రావిపూడి ఎంపిక చేసినట్లు టాక్. అయితే ఇందులో ఈ అమ్మాయి మెయిన్ హీరోయిన్ గా నటిస్తుందా లేక వేరే ఏదైనా పాత్ర నటిస్తున్నారో తెలియాల్సి ఉంది… ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపించగా ఇందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది ఈ భామ.. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న ఎప్పుడో వ‌చ్చేసింది. అయితే సినిమా సెట్స్ పైకి వెళ్ల‌డానికి కాస్త స‌మ‌యం ప‌ట్టింది. అందుకు కార‌ణం.. బాల‌కృష్ణ‌ను ఓ డిఫ‌రెంట్ యాంగిల్‌లో ప్రెజెంట్ చేస్తూ ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ప్రిపేర్ చేసుకున్న స్క్రిప్ట్‌. అయితే డిసెంబర్ 8 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది..

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ త‌న 107వ సినిమా వీర సింహా రెడ్డి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌బోతున్నారు. అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. కాగా గోపీచంద్ మల్లెని దర్శకత్వం వహిస్తున్న చిత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు ఇందులో శృతిహాసన్ హీరోయిన్..