అనసూయ ఆంటీ.. బ్రహ్మాజీ అంకుల్.. సెగలు పుట్టిస్తున్న ట్వీట్స్..!!

-

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన తాజా పరిస్థితులపై తనదైన కోణంలో కామెంట్ లు పెడుతూ దుమారం రేపుతుంటారు. ఇక అలా ఆయన చేసిన ఎన్నో కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశాయి. ఇక ఈ క్రమంలోనే తాజాగా బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. అసలు విషయంలోకి వెళ్తే గత కొన్ని రోజులుగా ఆంటీ అనే పదం నేషనల్ ట్రెండ్ అవుతుండగా ఇప్పుడు అంకుల్ రంగంలోకి దిగారు.. బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ చూస్తుంటే యాంకర్ అనసూయ పై ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేసినట్లు తెలుస్తోంది. నిజానికి లైగర్ సినిమా విడుదల కావడం.. అనసూయ విజయ్ దేవరకొండ పై పరోక్షంగా ట్వీట్ చేయడం రచ్చకు దారితీసింది.

అంతేకాదు ఈమె అమ్మను అన్న ఉసురు ఊరికే పోదంటూ.. కర్మ వెంటాడుతుంది అంటూ చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే అనసూయను విజయ దేవరకొండ అభిమానులు తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు ఆమెను ఆంటీ అని సంబోధిస్తూనే మరొక పక్క ఆమెను బాడీ షేమింగ్ కు గురి చేశారు. మరికొంతమంది చాలా అధ్వానంగా అనసూయను ఆంటీ ఆంటీ అంటూ పచ్చి బూతులు కూడా మాట్లాడారు.. మరోపక్క అనసూయ కూడా వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో ట్రోల్ చేస్తున్న ప్రతి ఒక్కరిపై రిటర్న్ కౌంటర్ వేసింది. అంతేకాకుండా తట్టుకోలేక ఎట్టకేలకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది అనసూయ.Actor Brahmaji counters on Anasuya Bharadwaj | అంకుల్ అంటావా? కేసు పెడతా.. యాంకర్ అనసూయపై బ్రహ్మాజీ సెటైర్స్!– News18 Teluguఅనసూయ పోలీస్ కేస్ తాలూకు మేటర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. ఇకపోతే ఆంటీ సంగతి పక్కన పెడితే ఇప్పుడు అంకుల్ వివాదాన్ని తెరపైకి తెచ్చారు బ్రహ్మాజీ. వాట్ హాపెనింగ్ అంటూ బ్రహ్మాజీ ట్విట్టర్ లో ఒక ఫోటో షేర్ చేయగా దీనిపై ఏం లేదు అంకుల్ అంటూ రియాక్ట్ అయ్యారు ఓ నెటిజన్.. దీంతో చిర్రేత్తుకుపోయిన బ్రహ్మాజీ నెటిజన్ కు చురకలంటించాడు. అంకుల్ ఏంట్రా.. అంకుల్.. కేసు వేస్తా.. ఏజ్.. బాడీ షేమింగ్ అంటూ.. దీంతో ఇది కచ్చితంగా యాంకర్ అనసూయకు కౌంటర్ ఇవ్వడమే అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇది గమనించిన మరొక నెటిజన్ .. అనసూయ గారు ఆమెను ఆంటీ అన్నందుకు మాత్రమే కేసు వేయలేదు అన్న.. ఆంటీ అంటూ వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడినందుకు కేసు వేస్తానని అన్నారు.. తోటి కళాకారులకు సహకారం ఇవ్వకుండా కామెడీ చేయడం ఏంటి బ్రహ్మాజీ అన్నా మీరు.. అంటూ ఆ నెటిజన్ పెట్టిన కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. అంతేకాదు మరెన్నో ట్వీట్లతో నెటిజన్లు సైతం రెచ్చిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news