అనసూయ జబర్దస్త్ మానేయడానికి కారణం వాళ్లేనట..!

-

ఈటీవీలో ప్రతి గురు-శుక్రవారాల్లో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటే ప్రేక్షకులకు చాలా ఇష్టం. ఈ షో వల్ల చాలా మంది కమెడియన్లు, యాంకర్లు మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. సినిమాల్లో అవకాశాలు కూడా సంపాదించుకున్నారు. చాలా మంది జబర్దస్త్ చూడటానికి కారణం యాంకర్ అనసూయే అని చెబుతుంటారు.

ఈ బ్యూటీ ఎంట్రీ సాంగ్ తోనే ఆ షో స్టార్ట్ అవుతుంది కూడా. ఆ ఎంట్రీ సాంగ్ లో ఈ బ్యూటీ హొయలు పలుకుతూ చేసే డ్యాన్స్ అంటే చాలా మందికి ఇష్టం. ఇక ఈ భామ ఈ కార్యక్రమం కోసం ధరించే ఔట్ ఫిట్స్ చూసి చాలా మంది ఫిదా అయ్యారు కూడా. అంతే కాకుండా తమ స్కిట్లలోనూ అనసూయను మధ్యలో తీసుకొస్తుంటారు.

ఈ మధ్యే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్నంత వరకు ఆ షో గురించి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయని అనసూయ బయటకు వచ్చాక తన బాడీ గురించి చాలాసార్లు స్కిట్స్ లో అవహేళన చేశారని చెప్పింది. అయితే ఇప్పుడు తాజాగా అనసూయ మరో కొత్త పాట పాడుతోంది. తాను జబర్దస్త్ వీడటానికి ఇన్నాళ్లూ ఏవేవో కారణాలు చెప్పిన ఈ భామ ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చింది. ఆ ఇద్దరి వల్లే షో మానేశానని చెబుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరనుకుంటున్నారా.. ఇంకెవరు ఆమె కొడుకులేనట.

అనసూయ తన పిల్లలతో గడపడానికి సమయం దొరకడం లేదనే ఉద్దేశంతోనే జబర్దస్త్ మానేశానని చెప్పుకొచ్చింది. ఓ వైపు సినిమాల షూటింగ్స్.. మరోవైపు జబర్దస్త్.. ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నానని.. అందుకే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేశానని చెప్పింది. అయితే ఎనిమిదేళ్లుగా జబర్దస్త్ తనకు చాలా మంచి కెరీర్ ఇచ్చిందని.. ఇప్పుడు సినిమాల్లో బిజీ అవడం వల్ల జబర్దస్త్ చేయడం కుదరకపోవడం కాస్త బాధగానే ఉందని అంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news