Anchor Srimukhi: నాకు అలాంటి మొగుడు కావాలి.. బాబ్లీ బ్యూటీ శ్రీముఖి

Anchor Srimukhi: శ్రీముఖి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్‌గా త‌న సత్తా చాటుతుంది. తిరుగులేని నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న ఎంతో మంది హృదయాల‌ను దోచుకుంది ఈ అమ్మ‌డు. బిగ్ బాస్ షో మ‌రింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ షో తర్వాత.. త‌న కెరీర్ పై దృష్టి పెట్టింది. అప్పుడప్పుడూ సినిమాలు న‌టించి త‌న వెలుగులు విరజిమ్ముతోంది. శ్రీముఖిని సోషల్ మీడియాలో కూడా చాల క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా త‌న‌కు కాబోయే వాడి గురించి క్రేజీ కామెంట్ చేసింది ఈ అందాల భామ‌.

తాజాగా ‘ఆహా’లో ప్ర‌సారం అవుతున్నా.. సర్కార్ అనే గేమ్ షో కు గెస్ట్ గా వ‌చ్చింది. ఈ షోకి స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎపిసోడ్ లో గేమ్ ఆడటానికి అలీ, శ్రీముఖి , ప్రవీణ్ , మధు వ‌చ్చారు. ఎంతో ఎంట‌ర్ టైన్ గా తన చలాకీ తనంతో అందరిని ఆకట్టుకునే శ్రీముఖి ఈ ఎపిసోడ్ కు హైలైట్ గా నిలిచింది.

ఈ క్ర‌మంలో యాంక‌ర్ ప్రదీప్ శ్రీముఖిని నీకు ఎలాంటి వ‌రుడు కావాల‌ని ప్ర‌శ్నించగా.. చాలా ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పింది. మంచి జాబ్ చేసే వ్యక్తి భార్త‌ కావాలని చెప్పింది. అలాగే చాలా అందంగా ఉండాలి దానితోపాటు డబ్బులు బాగా ఉండాల‌ని సమాధానం చెప్పింది. చాలా ఎంట‌ర్ టైన్ మెంట్ గా సాగిన ఈ షో కమెడియన్ ప్రవీణ్ విజేతగా నిలిచాడు.