బ్లాక్ బాస్టర్ ‘పటాస్’ టైటిల్ ఎవరిదో చెప్పేసిన అనిల్ రావిపూడి..!

-

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇటీవల F3 పిక్చర్ తో ఘన విజయం అందుకున్నారు. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఈ పిక్చర్ ఎఫ్2కు సీక్వెల్ అయినప్పటికీ వెరీ డిఫరెంట్ గా ఎఫ్ 3 మూవీ చేసి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇక అనిల్ రావిపూడి ఫస్ట్ ఫిల్మ్ ‘పటాస్’ విషయానికొస్తే..పోలీస్ సబ్జెక్ట్ కాగా, ఇది ఎంటర్ టైనింగ్ వేలో తీసి జనాలను ఎంటర్ టైన్ చేశాడు.

నందమూరి కల్యాణ్ రామ్ ను వెరీ డిఫరెంట్ అవతార్ లో ఈ పిక్చర్ లో అనిల్ రావిపూడి చూపించారు. ఇందులో కామెడీ సీన్స్ ఇప్పటికీ జనాలకు విపరీతంగా నచ్చుతాయి. నందమూరి కల్యాణ్ రామ్ ఈ ఫిల్మ్ ను ప్రొడ్యూస్ చేశారు. కాగా, ఈ సినిమా టైటిల్ ను ఎవరు ఇచ్చారో ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి తెలిపారు.

తను దర్శకుడిగా స్ట్రగుల్ అవుతున్న కాలంలో తన సినిమాకు ఏ టైటిల్ అయితే బాగుంటుందని అనుకుంటున్నానని, అప్పుడు తనకు లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ ‘పటాస్’ టైటిల్ బాగుంటుందని చెప్పాడని అనిల్ గుర్తు చేసుకున్నాడు.

అదే టైటిల్ ను అనిల్ రావిపూడి తన సినిమాకు పెట్టుకున్నాడు. ఇక ఈ పిక్చర్ సూపర్ హిట్ అయిన సంగతి అందరికీ విదితమే. అలా ఓ సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడి తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news