మ‌రో రికార్డు బ్రేక్ చేసిన వ‌కీల్ సాబ్‌.. కానీ ఆ మార్కును దాట‌లేక‌పోయాడు!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే టాప్ హీరో అయిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్ గురించి ఎంత చెప్పినా.. త‌క్కువే. ఆయ‌న ఎన్ని సినిమాలు ప్లాప్ అయినా.. క్రేజ్ మాత్రం ఇంచు కూడా త‌గ్గ‌లేదు. ఏ హీరోకు లేనంత అభిమాన ద‌ళం ఆయ‌న సొంతం. ప్లాప్ సినిమాల‌తో కూడా క‌లెక్ష‌న్స్ ప‌రంగా రికార్డులు క్రియేట్ చేశాడు ప‌వ‌ర్ స్టార్‌. ఇక ప‌వ‌న్ మూడేళ్ల విరామం త‌ర్వాత ఎంట్రీ ఇచ్చిన వ‌కీల్ సాబ్ ను క‌రోనా క‌ష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇంత‌టి క్లిష్ట ప‌రిస్థితుల్లో కూడా ప‌వ‌న్ సినిమాకు బాగానే క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. మ‌రి ప‌వ‌న్ సినిమా క‌దా అలాగే ఉంటుంది.

అయితే కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉడంటంతో అనుకున్నంత క‌లెక్ష‌న్లు రాలేవ‌నే చెప్పాలి. మ‌రో వూప థియేట‌ర్ల కూడా మూసివేయ‌డం పెద్ద దెబ్బే. ఇలా ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా.. ప‌వ‌న్ మ‌రో రికార్డును బ్రేక్ చేశాడు. అది వేరే హీరోల‌ది కాదు. ప‌వ‌ర్ స్టార్ దే. ఆయ‌న సినిమా అత్తారింటికి దారేది క‌లెక్ష‌న్లే ఇప్ప‌టి వ‌ర‌కు టాప్ లో ఉన్నాయి. కాగా ఆ లెక్క‌ల‌ను వ‌కీల్ సాబ్ బ్రేక్ చేశారు. అత్తారింటికి దారేది సినిమా రూ.81కోట్లు వ‌సూలు చేయ‌గా.. వ‌కీల్ సాబ్ రూ.85.17 కోట్లు వ‌సూల చేసి టాప్ లో నిలిచింది. అయితే రూ.100కోట్ల మార్కును మాత్రం అందుకోలేక‌పోయింది. కానీ త‌ర్వాత వ‌చ్చే సినిమాల‌తో ఆ మార్కును ప‌వ‌న్ అందుకుంటార‌ని ఆశిస్తున్నారు అభిమానులు.