ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత..

-

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో తరచుగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మలయాళ నటి అంబికా రావు (58) గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా ఎర్నాకులం లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం ఉదయం(జూన్ 27) రాత్రి తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల మలయాళ సినీ ఇండస్ట్రీ దిగ్ర్భాంతికి లోనైంది. మలయాళ చిత్ర పరిశ్రమలో 2002లో అడుగుపెట్టారు అంబికా రావు.

చలన చిత్ర నిర్మాత బాలచంద్ర మీనన్ యొక్క ‘కృష్ణ గోపాల కృష్ణ ‘ అనే సినిమాతో అసిస్టెంట్ దర్శకురాలిగా వృత్తిని ప్రారంభించారు. రెండు దశాబ్దాల పాటు సాగిన ఆమె కెరీర్లో మమ్ముట్టి యొక్క ‘రాజ మాణిక్యం’, ‘తొమ్మనుమ్ మక్కలుమ్’ మరియు పృధ్విరాజ్ యొక్క ‘ పెళ్లి నక్షత్రం’ వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు.కాగా ఆమె మృతి పట్ల టొవినో థామస్ తో పాటు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ద్వారా సంతాపం తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news