Anushka Shetty: చాన్నాళ్లకు సోషల్ మీడియాలో అనుష్క శెట్టి పోస్ట్..క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫొటో షేర్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’ సినిమా తర్వాత కొంచెం సైలెంట్ అయిపోయింది. బయట ఎక్కడా కనబడకపోతుండటంతో పాటు సినిమాలు కూడా ఏమీ చేయలేదు. 2020లో విడుదలైన ‘నిశ్శబ్దం’ చిత్రంలో ఈమె తెలుగు ప్రేక్షకులకు చివరగా వెండితెరపైన కనిపించింది. ఆ తర్వాత ఈ భామ కనబడలేదు. అలా కొంత కాలం పాటు సినిమాలకు దూరం అయిన దేవసేన.. ప్రజెంట్ సినిమాలు చేస్తోంది.

సోషల్ మీడియాలోనూ అప్పట్లో యాక్టివ్ గా ఉండే స్వీటీ.. ఇటీవల పెద్దగా పోస్టులు ఏమీ పెట్టలేదు. తాజాగా ఓ పోస్టు పెట్డంతో అభిమానులు సంతోషపడుతున్నారు. తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా బుధవారం షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పింది అనుష్క.

ఏళ్లు గడుస్తున్నా..తనకు ఎంత వయసొచ్చినా..తను ఎప్పుడు మీ మీ క్యూట్ పిల్లనే.. హ్యాపీ బర్త్ డే పాపా అనే క్యాప్షన్ తో అనుష్క ఫొటో షేర్ చేసింది.అనుష్క పోస్టు చూసిన నెటిజన్లు.. అనుష్క ఫాదర్ కు బర్త్ డే విషెస్ చెప్తు్న్నారు. సదరు ఫొటోలో అనుష్క వెరీ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చిందని కొందరు నెటిజన్లు అంటున్నారు.

అనుష్క ఇటీవల RRR సెలబ్రేషన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం అనుష్క యంగ్ హీరో నవీన్ శెట్టి చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. త్వరలో అనుష్క శెట్టి ఓ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ చేయబోతున్నదని వార్తలొస్తున్నాయి. చూడాలి మరి.. ఆ వార్తల్లో నిజమెంతుందో..

https://www.instagram.com/p/CckiEKVvExv/?utm_source=ig_embed&ig_rid=2514658a-892d-4a69-b9f6-a1e8c6919ffa

Read more RELATED
Recommended to you

Latest news