అనుష్క ఆదాయం.. వామ్మో అన్ని కోట్లా..?

-

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనుష్క శెట్టి 2005లో సూపర్ సినిమాతో తెలుగు సిని పరిశ్రమకు పరిచయమైంది. అప్పటి నుండి ఆమె స్టార్ హీరోయిన్ గా ఎప్పుడు సూపర్ ఫాం కొనసాగించింది. స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కొత్త క్రేజ్ తెచ్చింది. అరుంధతి నుండి భాగమతి వరకు అలాంటి సినిమాలు చేయాలంటే అనుష్కనే పర్ఫెక్ట్ అనేలా సూపర్ ఇమేజ్ ఏర్పరచుకుంది.

ఇక ఇన్ని సినిమాలు చేసిన అనుష్క ఎంత సంపాదించి ఉండొచ్చు అనుకుంటున్నారు. ప్రస్తుతం అనుష్క ఆస్తి వివరాలకు సంబందించిన ఓ న్యూస్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. 2005 నుండి ఇప్పటివరకు అనుష్క అక్షరాల 142 కోట్ల ఆస్థులను వెనుక వేసుకుందని తెలుస్తుంది. హైదరాబాద్, మంగళూరు, బెంగళూరు, వైజాగ్ తో పాటుగా ఇంకా పలుచోట్ల అనుష్క ప్రాపర్టీస్ ఉన్నాయట.

కేవలం సినిమాలతోనే కాదు యాడ్స్ తో కూడా అనుష్క సత్తా చాటుతుంది. మంచి ఫాంలో ఉన్నప్పుడూ వాణిజ్య ప్రకటనలకు అనుష్క 10 నుండి 12 కోట్ల దాకా తీసుకుందట. మరి ఈ అందాల భామ పెళ్లి చేసుకుంటే ఆమెతో పాటు కోట్ల కొద్ది ఆస్థి కూడా అతడి సొంతమవుతుంది. మరి ఆ అదృష్టవంతుడు ఎవరో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news