ఎన్టీఆర్ బయోపిక్ పై తేజ షాకింగ్ కామెంట్స్..!

-

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్.టి.ఆర్ జీవిత చరిత్రతో ఎన్.టి.ఆర్ సినిమా మొదలు పెట్టాడు నందమూరి బాలకృష్ణ. తేజ డైరక్షన్ లో అంగరంగ వైభవంగా మొదలైన ఈ బయోపిక్ కాస్త తేజ నుండి క్రిష్ చేతుల్లోకి వచ్చేసింది. క్రిష్ డైరక్షన్ లో ఒక సినిమాగా చేయాల్సిన బయోపిక్ కాస్త రెండు పార్టులుగా డివైడ్ చేశాడు.

ఇక ఎన్.టి.ఆర్ మొదటి పార్ట్ కథానాయకుడు రిజల్ట్ తెలిసిందే. సంక్రాంతి బరిలో క్రేజీ మూవీగా రిలీజైన ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా టాక్ బాగున్నా కలక్షన్స్ మాత్రం రాబట్టలేదు. అయితే ఈ బయోపిక్ నుండి తప్పుకున్న తేజ ఈ సినిమా ఎలా స్పందిస్తాడో తెలుసుకోవాలని ఉంటుంది కదా. అదే ప్రశ్న తేజ ముందు ఉంచితే తానింకా ఎన్.టి.ఆర్ కథానాయకుడు చూడలేదని తప్పించుకున్నాడు తేజ.

అంతేకాదు డ్రామా వర్క్ అవుట్ కాలేదన్న కామెంట్స్ కు స్పందిస్తూ డ్రామా పండించాలంటే చాలా మెదడు కావాలని అన్నాడు తేజ. అంటే క్రిష్ కు అలాంటి మెదడు లేదని తేజ అన్నట్టా అని అప్పుడే కామెంట్లు మొదలు పెట్టారు. ఫైనల్ గా ఎన్.టి.ఆర్ బయోపిక్ ఇంకా చూడలేదని తప్పించుకున్న తేజ అసలు తానెందుకు ఆ సినిమా నుండి బయటకు వచ్చాడన్న విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు.

Read more RELATED
Recommended to you

Latest news