Big Boss OTT Telugu: అరియానాకు ట్విస్టుల మీద ట్విస్టులిచ్చిన నాగార్జున..చివరకు ఆమె గెలుచుకున్నది అన్ని లక్షలు..

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘‘బిగ్ బాస్..’’ సీజన్ సిక్స్ OTT గేమ్ ఫైనల్ వీక్ లోకి ఎంటరయింది. ఇక శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. హైజ్ లోకి F3 ఫిల్మ్ టీమ్ వచ్చింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, యాక్టర్ సునీల్, హీరోయిన్ మెహ్రీన్ వచ్చారు. కాగా, ఇంటిలోనికి సూట్ కేసు తీసుకుని వెళ్లారు అనిల్, సునీల్.

ఇక హౌజ్ లోకి వెళ్లిన క్రమంలో సూట్ కేసులో ఉన్న మనీతో అడ్జస్ట్ అయ్యేందుకు అరియానా గ్లోరీ ఒప్పుకుని స్టేజీ మీదకు వచ్చింది. సూట్ కేసులో ఎంత అమౌంట్ ఉంది? అనేది చెప్పేందుకు ఆట పట్టించారు హోస్ట్ నాగార్జున. అమౌంట్ అంత , ఇంత అంటూ ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చారు.

దాంతో అరియానా గ్లోరీ…‘అనిల్, సునీల్’ లను ఉద్దేశించి ‘సచ్చినోళ్లు’ అని అనేసింది. చివరకు సూట్ కేసులో రూ.10 లక్షలు ఉన్నాయని నాగార్జున రివీల్ చేశారు. దాంతో అరియానా సంతోషం వ్యక్తం చేసింది. అలా అరియానా మొత్తానికి పది లక్షల రూపాయలు అయితే గెలుచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news