విధ్వంసం సృష్టిస్తున్న అవతార్ 2.. రూ.10,000 కోట్లకు పైగా ..!

-

సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ చిత్రాలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందన్న విషయం తెలిసిందే. అలాంటిది ఒక సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ వస్తే దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దీనికి నిదర్శనంగా నిలుస్తున్న చిత్రమే అవతార్: ది వే ఆఫ్ వాటర్. 2009లో వచ్చిన అవతార్ కి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది దీనికి కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో భారీ స్పందన వస్తోంది. డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా 16రోజుల్లోనే ఎంత కలెక్షన్స్ రాబట్టిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

విజువల్ వండర్ గా దాదాపు 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 180 కి పైగా భాషలలో విడుదలైన ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు ఇండియాలో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది అని చెప్పవచ్చు. 16వ రోజైన శనివారం కూడా బాగానే వసూలు రాబట్టింది ఈ చిత్రం. ఫలితంగా దీనికి రూ.2.45 కోట్లు వసూలు అయింది. 16 రోజుల్లోనే కేవలం తెలుగు రాష్ట్రాలలో నైజాంలో రూ.43.10 కోట్లు, సీడెడ్ లో రూ.9.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని ఏరియాలలో కలిపి రూ.28.68 కోట్లు వచ్చాయి.

రూ.81.28 కోట్లు గ్రాస్ వసూలు అయింది . మొత్తం కలిపి ఈ సినిమాకు రూ.86.30 కోట్లు వచ్చాయి. తెలుగులో రూ. 50 కోట్ల గ్రాస్ టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా కేవలం 16 రోజుల్లోనే రూ.36.30 కోట్ల లాభాలు సాధించింది. ప్రతిరోజు దీనికి సగటున రూ.20 కోట్లు గ్రాస్ వసూలు అవుతూనే ఉంది. ఇలా 16 రోజుల్లోనే ఇండియా మొత్తం మీద రూ.310.40 కోట్లు నెట్, రూ.360.88 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో ఈ సినిమా బాలీవుడ్ చిత్రాల రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.10,294.10 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news