చాలా మంది అల్పాహారం తీసుకునేటప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు కానీ ఉదయాన్నే అల్పాహారం తీసుకునే ముందు తప్పులు చేయకూడదు. తప్పకుండా స్కిప్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ ని తీసుకుంటూ ఉండండి. అలానే అల్పాహారం తీసుకునే ముందు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది. మరి ఎటువంటి వాటిని అల్పాహారం తీసుకునే ముందు తినాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
ఉదయాన్నే ఖాళీ కడుపు తో కొంచెం లెమన్ గ్రాస్ జ్యూస్ ని తీసుకుంటే జీర్ణ శక్తి బాగుంటుంది. కాబట్టి అల్పాహారం తీసుకునే ముందు ఖాళీ కడుపు తో దీనిని తీసుకుంటూ ఉండండి.
గోరు వెచ్చని నీళ్ల లో తేనె కలుపుకుని ఉదయాన్నే తీసుకుంటే కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. పరగడుపున గోరువెచ్చని నీళ్ల లో తేనె వేసుకుని తీసుకుంటే టాక్సిన్స్ ఈజీగా బయటికి వెళ్లిపోతాయి.
ఎండు ద్రాక్ష ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే కూడా చక్కటి పోషక పదార్థాలని మీరు పొందడానికి అవుతుంది.
వేసవి కాలంలో అయితే ఉదయాన్నే పుచ్చకాయ రసం తీసుకుంటే మంచిది. డీహైడ్రేషన్ సమస్య ఉండదు.
బొప్పాయి ముక్కల్ని కూడా మీరు ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది. ఇలా ఈ విధంగా మీరు అల్పాహారానికి ముందు వీటిని తీసుకుంటే చక్కటి బెనిఫిట్స్ ని పొందడానికి అవుతుంది ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవుతుంది.