భీష్మ పితామహగా బాలక్రిష్ణ…

-

నందమూరి బాలక్రిష్ణ వేయని గెటప్ అంటూ లేదు. సినిమాల్లో ఆయన రకరకాల గెటప్పుల్లో కనిపించి ప్రేక్షకులని ఎంతో అలరించారు. ముఖ్యంగా పౌరాణికం అంటే బాలయ్యకి చాలా ఇష్టం. పౌరాణిక పాత్రల్లో కనిపించడానికి, అలాంటి గెటప్పుల్లో నటించడానికి చాలా ఇష్టపడతారు. ఆ ఇష్టంతోనే గౌతమి పుత్ర శాతకర్ణి వంటి సినిమాలు వచ్చాయి. తాజాగా బాలక్రిష్ణ, డిఫరెంట్ గెటప్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. భీష్మ ఏకాదశి సందర్భంగా ఆ లుక్ ని విడుదల చేసారు.

ఇంతకీ ఆ లుక్ ఏ సినిమాలోది అని ఆశ్చర్యపోతున్నారా? భీష్మ పితామహగా బాలక్రిష్ణ ఏ సినిమాలో నటించాడని ఆరాలు తీస్తున్నారా? ఒక్క నిమిషం.. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాల్లో ఎన్టీఆర్ పాత్రలో కనిపించిన బాలయ్య, అందులో ఎన్టీఆర్ వేసిన అన్ని గెటప్పుల్లో నటించాడు. ఆ సినిమాలోదే ఈ లుక్. నిజానికి సినిమాలో ఈ లుక్ రివీల్ చేయలేదు. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున భీష్మ లుక్ లో బాలక్రిష్ణ ఫోటోలు రిలీజ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news