వైరల్ పిక్; బాలయ్య మాములుగా లేడుగా…!

-

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రూలర్ సినిమా ఫ్లాప్ తర్వాత బాలకృష్ణ ఈ సినిమాపై ఎక్కువగా దృష్టి సారించారు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వొద్దని ప్రస్తుత౦ హిట్ దర్శకుడితో సినిమా చేసి హిట్ ట్రాక్ లోకి రావాలని బాలయ్య భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన బోయపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమా లో ఏవిధంగా కనబడుతున్నారు, ఆయన లుక్ ఏవిధంగా ఉంటుంది, సినిమా కథ ఏంటి, బాలయ్య పాత్రకూ ప్రాధాన్యత ఏంటనే దానిపై నందమూరి అభిమానులతో పాటుగా బాలకృష్ణ అభిమానులలో కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు సంబంధించి ఒక ఫోటో బయటకు వచ్చింది.

ఇప్పటివరకు కనపడని బాలకృష్ణ ఈ సినిమాలో పడుతున్నారని లుక్ చూస్తేనే అర్థమవుతుంది. కొత్తగా వైట్ షర్ట్ వైట్ పాయింట్ ధరించి కనిపించారు. బాలకృష్ణ అలాగే గుండుతో దర్శనమిచ్చారు. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనపడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ లుక్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉందని అంటున్నారు బాలయ్య అభిమానులు.

ఈ సినిమాను ఎలా అయినా సరే దసరాకి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో విలన్ గా ఎమ్మెల్యే రోజా నటించే అవకాశం ఉందని, మెగా బ్రదర్ నాగబాబు కూడా నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే

Read more RELATED
Recommended to you

Latest news