BB3 టీజర్ తో రికార్డ్ క్రియోట్ బాలయ్య ..!

-

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతుంది. గతంలో బాలయ్య తో సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ని తెరకెక్కించిన బోయపాటి మరోసారి బాలయ్య ని ఎంతో పవర్ ఫుల్ గా చూపించబోతున్నారు. రెండు విభిన్న మైన పాత్రల్లో నటిస్తున్న బాలయ్య రీసెంట్ ఆయన బర్త్ డే సందర్భంగా ఒక పాత్రను రివీల్ చేశారు. BB3పేరుతో పవర్ ఫుల్ పాత్ర టీజర్ ని రిలీజ్ చేయగా ఈ టీజర్ యూట్యూబ్ లో సంచలనం సృష్ఠించింది.

 

బాలయ్య రేంజ్ అండ్ స్టామినా ఏంటో ఈ ఒక్క టీజర్ తో ఫ్యాన్స్ కే కాదు యాంటీ ఫ్యాన్స్ కి తెలిసింది. గతకొంతకాలంగా వరసగా ఫ్లాప్ వస్తుండటంతో బాలయ్య రేస్ లో కాస్త వెనకబడి పోయాడు. అంతేకాదు ..ఈ ఫ్లాప్స్ ని చూసి ఇక ఇప్పట్లో బాలయ్య కెరీర్ లో మళ్ళీ సక్సస్ అందుకోవడం కష్టం అన్న మాటలు వినిపించాయి. అంతేకాదు బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నారగానే పెదవి విరిచిన వాళ్ళు ఉన్నారు.

కాని ఈ టీజర్ అందరి అంచనాలని మార్చేసింది. మొన్నటి వరకు నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళే టీజర్ ఆ టీజర్ లో బాలయ్య డైలాగ్స్ చూసి షాకవుతున్నారు. ఇది కదా బాలయ్య నుండి అందరూ కోరుకునేది అంటూ చెప్పుకుంటున్నారు. అందుకు కారణం ఈ టీజర్ యూట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ ని సాధించడం ఇప్పుడు అభిమానుల్లో ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికి పెంచేసింది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతమందిస్తుండగా బాలయ్య సరసన కొత్తమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news