ట్రోల్లర్స్ కి చిక్కిన బాలయ్య…మరీ ఇలానా…?

-

హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి ట్రోల్లర్స్ చేతికి చిక్కారు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య ప్రవర్తన పట్ల నెటిజన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ అంజలిని నెట్టేయడం పట్ల కాస్త అసహనానికి లోనవుతున్నారు.వాటర్ బాటిల్ లో మద్యం సేవించినట్లు కొందరు నెటిజన్లు ఆరోపణ చేస్తున్నారు.ఎమ్మెల్యేగా రెండు సార్లు పనిచేసిన బాలయ్య మహిళల పట్ల అభ్యంతకరంగా వ్యవహరిస్తున్నారని మరోసారి మండిపడుతున్నారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య కూర్చున్న దగ్గర అంటే అయన కాళ్ళ దగ్గర రెండు వాటర్ బాటిల్స్ కనిపించాయి. అందులో ఓ వాటర్ బాటిల్ మందు కూడా ఉంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ బాలయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మందు తాగాడని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ ఏమో ‘వాటర్ కలర్ ని బట్టి అది లిక్కర్ అవుతుందా, అది లిక్కర్ అని ఎలా డిసైడ్ చేసేస్తారు? అంటూ బాలయ్య ని సపోర్ట్ చేస్తున్నారు.ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఇదే ఈవెంట్ లో హీరోయిన్ అంజలిని బాలయ్య పక్కకు తోసేశాడు.ఆ తర్వాత నవ్వుతూ దాన్ని కవర్ చేయడానికి ట్రై చేశాడు. ఈ వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇలా ఓ ఈవెంట్ లో బాలయ్య ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడం ఫ్యాన్స్ తప్ప నార్మల్ ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చడం లేదు. గతంలో చాలా సార్లు బాలయ్య ఇలానే బిహేవ్ చేశాడు. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయడంతో.. ‘బాలయ్య నువ్వు ఇక మారవా…? అంటూ ట్రోల్ చేస్తున్నారు.మొత్తానికి ఇలా బాలయ్య మరోసారి వార్తల్లో నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news