ఈ సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదును వున్న కత్తిలా తయారైంది. చాలా మంది దీనిని ఉపయోగించి కొత్త కెరియర్ స్టార్ట్ చేసి ఉన్నత స్థానంలో నిలిచారు. ఒకప్పుడు సామాన్య ప్రజలకు తన మనసులోని భావనను చెప్పుకోవడానికి సరైన వేదిక ఉండేది కాదు. టీవి ఛానెల్ లు, పేపర్స్ బడా బాబుల చేతుల్లో ఉండేవి. దీనితో సామాన్య జనం దిక్కు తోచని స్థితిలో ఉండేవారు. సోషల్ మీడియాలో వచ్చిన కొంచం టాలెంట్ ఉన్నా కూడా వెంటనే సెలబ్రిటీలు గా మారి పోతున్నారు.
మీకు గుర్తుందా ”బంగారం ఒక్కటి చెప్పానా’ అంటూ రీల్స్ చేసి తన అమాయకత్వంతో అందరిని నవ్వించిన అమ్మాయి శాంతి. పేదరికంలో పెరిగిన శాంతి ఓ షాప్‌లో పని చేస్తూ రీల్స్ చేయడం మొదలెట్టింది. అందరూ ఆమె తింగరితనం చూసి నవ్వుకునే వారు.కాని ఆమె ఒక ఇంటర్వ్యూ సందర్బంగా తన జీవితంలో జరిగిన కష్టాలు గురించి చెప్పే సరికి అందరూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. అంతకు ముందు బాడ్ కామెంట్స్ పెట్టిన వారు కూడా సారి సిస్టర్ అంటూ సెంటిమెంట్ కామెంట్స్ పెట్టారు.
ఇక రీసెంట్ గా ఆమె పెట్టిన విడియో వైరల్ గా మారింది. ఇది కూడా నవ్వుకునే తింగరి వీడియో కాదండోయ్. అది పల్లెటూరి పిల్లలా ఉండే బంగారాన్ని మంచి మోడల్ లా తీర్చి దిద్దిన వీడియో. స్పార్క్ అనే మేకప్ స్టూడియో వాళ్లు తనని పిలిపించి.. తనకు సూపర్ గా మేకప్ చేసి తర్వాత మంచి కాస్టూమ్స్ వేసి ఆమె లుక్ మొత్తం మార్చి వేశారు. బంగారం లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అందరూ అనుకునేలా చేశారు. ఇది ఆ సంస్థ ప్రమోషన్ కోసం చేసిన విడియో… మీరు ఓ లుక్కయండి..