అది తట్టుకోలేకే సుషాంత్ సూసైడ్ చేసుకున్నాడు ..బయట పడ్డ సీక్రెట్ ..!

-

బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలన్ని ఉలిక్కి పడ్డ సంఘటన బాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకొని మరణించడం. ఎప్పుడైతే సుషాంత్ సూసైడ్ చేసుకున్నాడో ఆ తర్వాత గంట నుంచే అన్నీ మీడియా మాద్యమాలలో రక రకాల కోణాలలో వార్తలు వస్తున్నాయి. ఆరోజు నుంచి ఈ రోజు వరకు ముంబై మీడియాతో పాటు టాలీవుడ్ మీడియాలోను పలువురు ప్రముఖులు స్పందిస్తూ తమ సానుభూతిని తెలుపుతున్నారు.

 

ఇక ఈ సంఘటన జరిగాక బాలీవుడ్ లో గత కొన్నేళ్ళుగా జరుగుతున్న చీకటి వ్యవహారాలను అందులో ఉండే టాప్ సెలబ్రిటీస్ కి సంబంధించ సీక్రెట్స్ అన్ని బయట పడుతున్నాయి. చెప్పాలంటే వాస్తవాలు ఎంతవరకు నిజమో తెలీదు గాని సుషాంత్ ఆత్మహత్య వెనక పలువురు బాలీవుడ్ ప్రముఖుల వేదింపులున్నాయని మీడియాతో కొంతమంది సెలబ్రిటీస్ వాపోతున్నారు.

 

అయితే ఈ సంఘటనలకి సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. సుషాంత్ డెత్ కేసు ను ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిలో భాగంగా సుశాంత్ సన్నిహితులతో పాటు, ఆయనకు మానసిక వైద్యం అందించిన డాక్టర్ ని కూడా విచారించారట. విచారణలో పాల్గొన్న మానసిక వైద్యుడు కేసరి చావ్డా సుశాంత్ మానసిక స్థితి గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయట పెట్టినట్టు తెలుస్తుంది. సుశాంత్ కి ఎంతో ఇష్టమైన అంకిత లోఖండే తో బ్రేక్ అప్ కావడం మానసికంగా కృంగిపోయాడట. ఇదే పదే పదే తలచుకొని డిప్రెస్ అయ్యోవాడని సుషాంత్ ఆత్మ హత్యకి ఇదే ప్రధాన కారణం అని డాక్టర్ వెల్లడించాడట.

Read more RELATED
Recommended to you

Latest news