గ్లామర్ స్పీక్స్ వెల్
ఈ మాట అందాల భామలను చూస్తే తెలుస్తుంది
మాట్లాడుతూ ఉంటే వారి జీవన శైలి వెల్లడవుతుంది
ఆ కోవలో ఆ తోవలో ఒకరు స్టార్ హీరోయిన్
అటు బాలీవుడ్ కు ఇటు టాలీవుడ్ కు కూడా
అభినయం అందం కలిసి నడిచివచ్చిన తీరులో
ఆమె ఉన్నారు ఉంటారు కూడా! ఆ అదృష్ట రాశి మన మధ్యే ఉన్నారు
ఆమె పేరు కియారా అడ్వానీ.
అవకాశాలు ఎలా ఉన్నా కొన్ని ఇష్టాలు మారకూడదు.అలా అందాల కియారాకు గుడ్డు అంటే ఇష్టం ఉండదు అని చెప్పారు. అవకాశాలు ఎలా ఉన్నా గ్లామర్ ఫీల్డ్ లో అతి పనికి రాదు. అతి తిండి అనర్థదాయకం కూడా ! అందుకే ఆమె ఫిజిక్ ను జాగ్రత్తగా కాపాడుకుంటూ తెరపై తళుకులీనేందుకు ఇష్టపడతారు. మొగ్గు చూపుతారు అని రాయాలి. చాకెలెట్లంటే ఇష్టం అని చెబుతారామె. దోసెలన్నా ఇష్టమే అని అంటారామె. మితంగా తింటూ వేళకు వర్కౌట్స్ చేయడంలోనే సిసలు రహస్యం ఉంది. ఈ అమ్మడు వర్కౌట్ల డేటా తెలియదు కానీ తిండి విషయమై మాత్రం జాగ్రత్తల్లోనే ఉంటారని తెలుస్తోంది. ఇంకా మరో విషయం ఏమంటే ఈమె దృష్టిలో ప్రేమంటే ఎనలేని సంతోషం! ఇదే మాట అంటున్నారు ఓ చోట. ఏదేమయినా మన కబీర్ సింగ్ (తెలుగు లో అర్జున్ రెడ్డి) ఆమెను మాయ చేశాడు. కాదు కాదు ఆమెనే అతడిని మాయ చేసింది. తెలుగు కన్నా హిందీ వెర్షన్ ఇంకా బాగా వచ్చేందుకు కారణం ఒకరు కియారా రెండు కియారా మూడు కూడా కియారానే !
ఇంకా చెప్పాలంటే..రెండు సినిమాలు మాత్రమే ఆమె జీవితాన్ని మార్చివేశాయి. ఆవిధంగా ఆమె అంటే ఇష్టం కానీ ప్రేమ కానీ కలిగేందుకు అవకాశం ఇచ్చాయి. అదేవిధంగా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు చేజిక్కించుకునేందుకు ఆమె అందంతో పాటు అభినయం కూడా ఓ కారణం కావడంతో ఇవాళ ఆమె స్టార్ స్టేటస్ ను ఎక్స్‌పీరియెన్స్ చేస్తున్నారు. నవ్వుల కాంతులను పంచుతున్నారు. తనదైన ప్రతిభతో రాణిస్తూ.. తెలుగు చిత్ర సీమకు మళ్లీ మరో సారి వస్తున్నారు. అదేవిధంగా ఇంకొన్ని అవకాశాలు కథ పరంగా వెన్నాడుతున్నాయి.వాటిపై కూడా దృష్టి నిలిపి తన ఆసక్తినీ,అభిరుచినీ అర్థం చేసుకునే దర్శకులతో పనిచేసేందుకు సిద్ధం అవుతున్నారు.
భరత్ అను నేను సినిమాతో కియారా అడ్వానీ పేరు మార్మోగిపోయింది. ఆ సినిమాలో మహేశ్ బాబు సరసన నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఆ తరువాత తెలుగులో కెరియర్ కు చెప్పుకోదగ్గ బ్రేక్ దక్కలేదు. దీంతో బాలీవుడ్ కు వెళ్లి అవకాశాలు వెతుక్కుని తనని తాను నిరూపించుకుంది. అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ లో కూడా నటించింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ శంకర్ దృష్టి పడింది. ఆర్సీ 15 (రాం చరణ్ తేజ్ హీరో) సినిమా ప్రాజెక్టుకు ఓకే చెప్పింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
– బ్యూటీ స్పీక్స్ – మన లోకం ప్రత్యేకం