తెలంగాణ ప్రభుత్వం రాజ్ భవన్, గవర్నర్ వ్యవస్థను కావాలనే అవమానిస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు అవమానిస్తున్నారో వారికే తెలియాలని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసిన తరువాత ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పరిస్థితుల గురించి మంత్రికి తెలియజేశానని అన్నారు. నేను ఎప్పుడూ తెలంగాణ ప్రజల కోసమే ఆలోచిస్తున్నానని అన్నారు. ఈనెల 10వ తేదీని భద్రాచలం శ్రీరామ దేవస్థానానికి వెళ్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణించగలిగే పరిస్థితి ఉందని ఆమె అన్నారు. గతంలతో సమ్మక్క- సారలమ్మ దర్శనానికి కూడా రోడ్డు మార్గంలోనే వెళ్లానని, నాగర్ కర్నూల్ పర్యటనకు కూడా రోడ్డు మార్గంలోనే వెళ్లానని… తెలంగాణలో గవర్నర్ కేవలం రోడ్డు మార్గంలోనే వెళ్లే పరిస్థితి ఉందని గవర్నర్ తమిళి సై అన్నారు. ఇటీవల యాదాద్రి పర్యటనకు వెళ్తే బీజేపీ వ్యక్తిగా వెళ్లానంటూ విమర్శలు చేశారని.. నేను ఇన్ని రోజుల్లో కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని కలిశానని అన్నారు. రాజ్ భవన్ తలుపులు తెరిచే ఉన్నాయని… ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్ రావచ్చని చర్చించవచ్చని ఆమె అన్నారు. మహిళగా, సోదరిగా గౌరవించడం లేదని ఆమె అన్నారు.
గవర్నర్ వ్యవస్థను అవమానిస్తున్నారు…. మహిళా గవర్నర్ కు కనీస గౌరవం ఇవ్వడం లేదు: తమిళి సై
-