నటనతో పాటు 94 శాతం మార్కులతో చదువులో నూ రాణిస్తున్న ముద్దుగుమ్మ..

చాలా మంది చదువులో వెనుకబడి పోతూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం చదువుతో పాటు మిగతా రంగాల్లోనూ రాణిస్తూ… అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. వేరే రంగంలో దూసుకుపోతున్నారు కదా ఇక చదువులో ఏం రాణిస్తారులే అని ఇంట్లో వాళ్లు, బయటి వాళ్లు అందరూ భావిస్తున్నా సరే వారికి చదువు మీద ఉన్న మక్కువతో ఏదో సాధించాలనే తపనతో మెరుగ్గా రాణిస్తారు. ప్రస్తుతం బాలీవుడ్ ముద్దుగుమ్మ అష్నూర్ కౌర్ గురించి అందరూ ఇలాగే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. విషయమేంటంటే ఆమె తాజాగా ప్రకటించిన సీబీఎస్ఈ ఫలితాల్లో 94 శాతం మార్కులు సాధించి అందర్నీ ఔరా అనేలా ఆశ్చర్యచకితులను చేసింది.

అష్నూర్ కౌర్ బుల్లి తెరతో పాటు వెండి తెర మీద కూడా అడపాదడపా మెరుస్తూ ఉంటుంది. అటువంటి ఈ భామ షూటింగ్స్ లో తీరిక లేకుండా గడపడం సహజం. కానీ ఈమె చదువును తేలిగ్గా తీసుకోలేదు. పట్టుదలతో చదివి సీబీఎస్ఈ ఫలితాల్లో 94 శాతం మేర మార్కులు సాధించింది. ఈ భామ ఝాన్సీ కి రాణి, యే రిస్తా క్యా కహ్లాతా హై, పాటియాల జేబ్స్ వంటి సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమ్మడి నటనకు చాలా మంది అభిమానులు ఫిదా అయ్యారు. కాగా ఇలా అత్యధికంగా మార్కులు రావడంపై ఈ అమ్మడు స్పందిస్తూ… తాను పడిన కష్టానికి ప్రతిఫలం లభించిందని తెలపడం గమనార్హం. ఓ వైపు షూటింగుల్లో కష్టపడుతూ నటిస్తూనే మరో వైపు ర్యాంకులు సాదించేలా చదవడం మామూలు విషయం కాదని చాలా మంది ఈ బ్యూటీని ప్రశంసిస్తున్నారు. కాగా కౌర్ కు 10లో 93 శాతం మార్కులు వచ్చాయి. కాగా 12వ తరగతిలో అంతకన్నా ఎక్కువ మార్కులు సాదించాలనే పట్టదలతో కష్టపడి చదివినట్లు పేర్కొంది.