వెంకటేశ్ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్.. తర్వాత ఏం జరిగిందంటే..!?

-

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్..ఇటీవల F3 ఫిల్మ్ తో సక్సెస్ అందుకున్నారు. ట్రెండ్ కు తగ్గట్లు మాత్రమే కాదు వెరీ డిఫరెంట్ మూవీస్ చేయడంలో ఎప్పుడూ ముందుండే హీరోగా ఈ సినిమాతో వెంకటేశ్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. తన కెరీర్ లో యాక్షన్ ప్లస్ లవ్ సినిమాలు చేసిన వెంకటేశ్..కుటుంబ కథా చిత్రాలతో ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు.

వెంకటేశ్ సినిమా వస్తుందంటే చాలు.. జనాలు థియేటర్లకు వెళ్లాల్సిందే అనేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా కామెడీ ప్లస్ ఎమోషన్ పైన వెంకటేశ్ కాన్సంట్రేట్ చేసే వారు. ఆయన సినిమాల్లో అన్ని అంశాలు సమపాళ్లలో ఉంటాయి. కాగా, ఆయన నటించిన రొమాంటిక్ లవ్ స్టోరి ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ప్రేమించుకుందాం..రా..!’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇందులో హీరోయిన్ గా అంజలా ఝవేరి నటించింది. కానీ, తొలుత హీరోయిన్ గా అందాల తార ఐశ్వర్యారాయ్ ను అనుకున్నారు. కానీ, తర్వాత ఆమె స్థానంలో అంజలా వచ్చింది. అందుకు గల కారణాలేంటో తెలుసుకుందాం.

‘ప్రేమించుకుందాం..రా..’ చిత్రం కంటే ముందు వెంకటేశ్ చేసిన చిత్రాలన్నీ కూడా కుటుంబ కథా చిత్రాలే. ఈ నేపథ్యంలో వెంకటేశ్ తో ఏదైనా డిఫరెంట్ మూవీ చేయాలని ప్రొడ్యూసర్ సురేశ్ బాబు అనుకున్నారు. ఒక మంచి లవ్ స్టోరి అయితే బాగుంటుందని అనుకున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ ఓ లవ్ స్టోరి రెడీ చేశారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ లవ్ స్టోరి తీసుకొచ్చాడు.

అలా ఆ స్టోరి సురేశ్ బాబుకు నచ్చింది. అలా సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా స్టర్ట్ అయింది. మహదేవన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్ అయింది. అయితే, ఈ పిక్చర్ లో హీరోయిన్ గా డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ ఐశ్వర్యారాయ్ ను ఫిక్స్ అయ్యారట.

తన బంధువులతో ఉన్న కాంటాక్ట్ ద్వారా ఐశ్వర్యారాయ్ ను ఎలాగైనా ఒప్పించి ఈ సినిమా చేయాలని జయంత్ అనుకున్నారట. కానీ, అప్పటికే ఐశ్వర్యారాయ్ నటించిన చిత్రాలు వరుసగా అనుకున్న స్థాయిలో ఆడటం లేదు. దాంతో ఆమె స్థానంలో అంజటా ఝవేరిని తీసుకున్నారు.ఇక ‘ప్రేమించుకుందాం..రా..’ పిక్చర్ లో హీరో, హీరోయిన్స్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుట్ అయింది. కామెడీ సీన్స్ తో పాటు లవ్ స్టోరి, ఎమోషన్స్ అన్నీ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. ఈ చిత్రం యూత్ కు బాగా కనెక్ట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news