ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నకు సిగ్గుతో తలవంచుకున్న అశ్వనీదత్.. తర్వాత..!!

-

టాలీవుడ్ భారీ నిర్మాత సి.అశ్వనీదత్ ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్ ఎంతటి బ్లాక్ బాస్టర్స్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ చిత్రాలను నిర్మించిన అశ్వనీదత్.. తాజాగా ‘సీతారామం’ సినిమాతో ఘన విజయం అందుకున్నారు. హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కథానాయకుడిగా దుల్కర్ సల్మాన్ నటించగా, హీరోయిన్ గా మృణాళ్ ఠాకూర్ నటించింది. ఈ సంగతులు అలా పక్కనబెడితే.. అశ్వనీదత్..సీనియర్ ఎన్టీఆర్ కు ఎంతటి వీరాభిమానియో అందరికీ తెలుసు. ఆయనతో పలు సినిమాలు తీసిన అశ్వనీదత్.. ‘ఎదురు లేని మనిషి’ షూటింగ్ టైమ్ లో ఎన్టీఆర్ నుంచి వచ్చిన ప్రశ్నకు సిగ్గుపడిపోయాడు. ఇంతకీ ఆయన ఏం అడిగాడో.. ఇప్పుడు తెలుసుకుందాం.

బాపయ్య దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘ఎదురు లేని మనిషి’ చిత్రాన్ని అశ్వనీదత్ ప్రొడ్యూస్ చేశారు. ఇక ఇందులో ఎన్టీఆర్ గెటప్ చాలా కొత్తగా ఉంటుంది. 1976లో వచ్చిన ఈ పిక్చర్ ఘన విజయం సాధించింది. కాగా, ఈ సినిమా స్టార్టింగ్ డే న ‘కసిగా ఉంది’ అనే పాటను షూట్ చేశారు.

ఇక ఈ పాటను షూటింగ్ కు వచ్చే ముందర విన్న ఎన్టీఆర్.. షూటింగ్ కు వచ్చిన తర్వాత తాను ఈ పాటకు డ్యాన్స్ చేయాలా? అని అశ్వనీదత్ ను అడిగారట. దాంతో అశ్వనీదత్ సిగ్గుతో తలవంచుకున్నారట. ఆ తర్వాత ‘నేను మీ అభిమానిని సర్.. నా అభిమాన నటుడు ఎలా ఉండాలో.. ఏ గెటప్ లో కనిపిస్తే బాగుంటుందో కొన్ని ఆలోచనలున్నాయి.. వాటి ప్రకారం…ఫిల్మ్ స్టోరి రెడీ చేసుకుని ఇలా చూపిస్తున్నాం.. మీ నుంచి కొత్తదనం కావాలి..’ అని అన్నారట.

అశ్వనీదత్ మాటలు విన్న సీనియర్ ఎన్టీఆర్.. తన అభిమానుల కోసం చేయాలనుకున్నారు. అలా ఇక ‘కసిగా ఉంది’ పాటలో సరికొత్త గెటప్ వేసుకుని సాంగ్ లో డిఫరెంట్ స్టె్ప్పులేసేశారు. వాణి శ్రీతో కలిసి చిత్ర విచిత్రంగా చిందులేశారు ఎన్టీఆర్. ఈ పాట కోసం సీనియర్ ఎన్టీఆర్ కొత్త విగ్గు పెట్టుకుని సరి కొత్త గెటప్ లో కనిపించారు. అలా ఎన్టీఆర్ గెటప్ కూడా సరి కొత్త ట్రెండ్ సెట్ చేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news