మహేశ్ బాబు ‘ఒక్కడు’ సినిమాకు ముందు అనుకున్న టైటిల్స్ ఇవే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ పిక్చర్ ‘ఒక్కడు’. ఈ సినిమాతో ఆయన తన సత్తా ఏంటో చూపించాడని మహేశ్-కృష్ణ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల మహేశ్ బర్త్ డే సందర్భంగా ‘ఒక్కడు’ రీ-రిలీజ్ చేశారు. రీ-రిలీజ్ లోనూ ఈ సినిమా రికార్డు వసూళ్లు చేసింది. ఈ సినిమా టైటిల్ విషయంలో అప్పట్లో వివాదం కూడా జరిగిందట. ‘ఒక్కడు’ కంటే ముందు ఈ సినిమాకు రకరకాల టైటిల్స్ ను దర్శకుడు గుణశేఖర్ అనుకున్నారట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్ చేసిన ‘ఒక్కడు’ పిక్చర్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మహేశ్ బాబు, భూమిక జంటగా నటించిన ఈ ఫిల్మ్.. సూపర్ సక్సెస్ అయింది. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఇందులో కీలక మైన పాత్ర పోషించి సినిమా స్థాయిని ఇంకా పెంచేశారని సినీ పరిశీలకులు విశ్లేషించారు. దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇక దర్శకుడు చెప్పినట్లు విని మహేశ్ బాబు చాలా కష్టపడి నటించారు. ఇక మూవీ టైటిల్ విషయానికొస్తే.. తొలుత ఈ సినిమాకు ‘అతడే ఆమె సైన్య’ అనే టైటిల్ అనుకున్నారట.

ఈ టైటిల్ ఫిక్స్ చేసుకున్న గుణశేఖర్.. ఈ విషయమై మూవీ యూనిట్ కు కూడా చెప్పేశాడట. కానీ, ఆ టైటిల్ ను ఎవరో ఒకరు రిజిస్టర్ చేసుకున్నాడు. దాంతో అతడిని కన్విన్స్ చేసేందుకు గుణశేఖర్ ట్రై చేసినప్పటికీ అది కుదరలేదట. దాంతో ఈ సినిమా కు నెక్స్ట్ టైటిల్ గా ‘కబడ్డీ’ అని అనుకున్నారు. కానీ, అది కూడా సరిగా లేదని అభిప్రాయానికి వచ్చి చివరగా ‘ఒక్కడు’ అనే టైటిల్ అనుకున్నారు. అది మహేశ్ కు చెప్పగా ఆయన కూడా వెంటనే ఒకే చేసేశారు.

అలా ఈ సినిమాకు టైటిల్ ‘ఒక్కడు’ ఫిక్స్ అయింది. ఇక ఈ సినిమా ఎంతటి సూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. యూత్ ఫేవరెట్ ఫిల్మ్ గా ‘ఒక్కడు’ నిలిచిపోయింది. ‘ఒక్కడు’ చిత్రంలో మ్యూజిక్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా బాగా కుదిరాయి. జనాలు ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.