Bheemla nayak : “భీమ్లా నాయక్” ట్రైలర్ రిలీజ్.. గత్తర లేపిన పవన్ కళ్యాణ్

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. హీరో రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజాగా భీమ్లా నాయక్‌. యంగ్‌ డైరెక్టర్‌ సాగర్‌ కే, చంద్ర ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్ పవన్కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే సంయుక్త మీనన్ హీరో రానా సరసన నడుస్తోంది.మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్.

ఇక భీమ్లా నాయక్ సినిమా నుంచి వచ్చిన.. పోస్టర్లు, టీచర్లు మరియు పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసింది చిత్రబృందం. ఫిబ్రవరి 25 వ తేదీన బీమ్లా నాయక్ సినిమా విడుదల కానుంది. ఇది ఇలా ఉండగా… తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసేందుకు చిత్ర బృందం.

ఈ ట్రైలర్ లో… పవన్ కళ్యాణ్ చాలా పవర్ఫుల్ రోల్ లో కనిపించారు. అటు రానా- పవన్ కళ్యాణ్ మధ్య సీన్స్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమా హైప్ అమాంతం పెంచేసింది. కాగా ఇవాళ జరగాల్సిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news