బాలీవుడ్ లోకి భింబిసారా చిత్రం..మరో కార్తికేయ 2 లాంటి హిట్ అవుతుందా?

ప్రస్తుతం మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ హవానే కనిపిస్తుంది..మన తెలుగు వాళ్ళని మరియు మన తెలుగు సినిమాలను ఎప్పుడూ చిన్న చూపు చూసే బాలీవుడ్ ఇండస్ట్రీ కి ఇప్పుడు మన తెలుగు సినిమాలే రక్ష గా మారాయి..బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలన్నీ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద పల్టీలు కొడుతున్న సమయం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా కొత్త ఊపిరి పోసింది..కేవలం 3 కోట్ల రూపాయిల వసూళ్లతో ప్రారంభమైన ఈ సినిమా ఫుల్ రన్ లో కేవలం బాలీవుడ్ నుండే వంద కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది.

ఆ తర్వాత ఎన్టీఆర్ – రామ్ చరణ్ – రాజమౌళి #RRR సినిమా అయితే ఏకంగా 300 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది..ఇప్పుడు వరుసగా ఖాన్స్ సినిమాలు సైతం బొక్కబోర్లా పడి అతి క్లిష్టమైన సమయాన్ని ఎదురుకుంటున్న సమయం లో బాలీవుడ్ ని ఆదుకున్న సినిమా నిఖిల్ హీరో గా నటించిన ‘కార్తికేయ 2’ చిత్రం..ఈ సినిమా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ ని కూడా దున్నేస్తుంది.

దీనితో కళ్యాణ్ రామ్ తన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం భింబిసారా సినిమాని బాలీవుడ్ లో దబ్ చేసి రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు..టాలీవుడ్ లో జులై నెలలో విడుదలైన సినిమాలన్నీ దారుణమైన పరాజయాలు పాలై అతి నీచమైన పరిస్థితి ని ఎదురుకుంటున్న కి భింబిసారా చిత్రం కొత్త ఊపిరి ని పోసింది..కేవలం రెండు వారాల్లోనే 34 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇప్పుడు ఇదే సినిమాని బాలీవుడ్ లో తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా విడుదల చేస్తే కచ్చితంగా సూపర్ హిట్ సాధిస్తుంది అనే నమ్మకం తో ఉన్నాడట కళ్యాణ్ రామ్..త్వరలోనే భింబిసారా హిందీ వెర్షన్ కి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించబోతున్నారు..భింబిసారా సినిమా హిందీ లో కనుక సూపర్ హిట్ అయితే భింబిసారా 2 సినిమాకి హిందీ లో ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరుకు అదిరిపొయ్యే కలెక్షన్స్ వస్తాయి..బాలీవుడ్ లో సీక్వెల్స్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ ఏడాది విడుదలైన KGF మూవీ సీక్వెల్ KGF చాప్టర్ 2 ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..కేవలం బాలీవుడ్ నుండి ఆ సినిమాకి 550 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..బాహుబలి 2 కి అయితే హిందీ లో 670 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది..సీక్వెల్స్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అలాంటిదిమరి..ఇప్పుడు బాలీవుడ్ మొత్తం పుష్ప పార్ట్ 2 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది..భింబిసారా హిట్ అయితే భింబిసారా 2 సినిమా కోసం కూడా బాలీవుడ్ ప్రేక్షకులు మంచి వసూళ్లనే ఇస్తారు..పైన చెప్పిన సినిమాల రేంజ్ లో కాకపోయినా కూడా 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అయితే వస్తాయి..మరి తెలుగు ప్రేక్షుకులను ఈ రేంజ్ లో అలరించిన భింబిసారా చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను కూడా అదే రేంజ్ లో అలరిస్తుందా లేదా అనేది చూడాలి.