Bichagadu 2 : ఇంట్రెస్టింగ్​గా ‘బిచ్చగాడు-2’ ట్రైలర్.. BGM అదుర్స్

-

తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా ఏ రేంజ్​లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అమ్మ సెంటిమెంట్​తో విజయ్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాడు. అందుకే దీనికి సీక్వెల్​ తీయాలనుకున్నారు మేకర్స్. ఈ క్రమంలో సూపర్‌హిట్‌ చిత్రం ‘బిచ్చగాడు’కు కొనసాగింపుగా ‘బిచ్చగాడు 2’ తెరకెక్కింది. (స్వీయ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ హీరోగా నటిస్తున్న ఈ సీక్వెల్‌ మే 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్ చాలా పవర్ ఫుల్​గా కనిపించింది. ట్రైలర్ చూస్తుంటే ఈసారి సినిమాలో విజయ్ చాలా పవర్ ఫుల్​ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ ఆంటోని టూ షేడ్స్​లో ఉన్న పాత్రలో కనిపించినున్నట్లు సమాచారం. సూటు బూటు వేసుకుని సూపర్ స్టైలిష్​గా కనిపిస్తున్న ఓ లుక్​లో విజయ్ మెస్మరైజ్ చేస్తున్నాడు. మరోవైపు గడ్డం.. మాల వేసుకున్న రఫ్​ లుక్​లోనూ అలరించాడు. ట్రైలర్​లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదుర్స్. పార్ట్-1లో అమ్మ సెంటిమెంట్​తో వచ్చిన విజయ్.. పార్ట్​-2లో ప్రేక్షకులను ఎలా అలరించనున్నాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news