Big Boss Non Stop: బిందు మాధవా మజాకా..ఆమెను ఇమిటేట్ చేసి సత్తా చాటిన ఆడపులి

-

‘బిగ్ బాస్’ OTT షోలో కంటెస్టెంట్ బిందు మాధవి మొదటి నుంచి సత్తా చాటుతోంది. టాస్కులు ఆడటంతో పాటు తన పాయింట్ ను స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్పేసి బీ బీ లవర్స్ మనసు దోచేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఈమెకు ఆడపులి అని పేరు కూడా పెట్టేశారు బీబీ ప్రేక్షకులు.

షో పదో వారం లోకి ఎంటర్ కాగా, సోమవారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బిందు మాధవి ..హౌజ్ లో మిత్రాశర్మను ఇమిటేట్ చేసింది. పూర్తిగా మిత్రా శర్మ గా మారిపోయి..మరీ ఆమెలాగానే బిహేవ్ చేసింది బిందు. స్ట్రాటజీ ప్రకారమే బిందు మాధవి ఇలా చేసిందని బీబీ లవర్స్ ఆమెను లభినందిస్తున్నారు.

మొదటి నుంచి బిగ్ బాస్ హౌజ్ లో టాప్ 5 కంటెస్టెంట్ గా ఉన్న బిందు మాధవి తన పర్ఫార్మెన్స్ ను అలానే కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆడపులి డెఫినెట్ గా టైటిల్ విన్ చేస్తుందని బీబీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఓటింగ్ లోనూ బిందు మాధవి మొదటి నుంచి సత్తా చాటుతోంది.

ఇక నామినేషన్ సందర్భంగా కూడా గతంలోనూ చాలా సార్లు బిందు మాధవి లేవనెత్తిన అంశాలు బీబీ లవర్స్ తో పాటు కంటెస్టెంట్స్ కూ బాగా నచ్చాయి. ఈ క్రమంలోనే బీబీ రివ్యుయర్స్, లవర్స్ బిందు మాధవి చాలా జాగ్రత్తగా గేమ్ ఆడుతుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే, ‘బిగ్ బాస్’ నిర్వాహకులు టాస్కుల విషయంలో ఈ సారి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తు్న్నారని బీబీ లవర్స్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news