Big Boss OTT Telugu: ఈ వారం ‘బిగ్ బాస్’ కెప్టెన్ శివ.. తోటి సభ్యుల మద్దతు దక్కేనా?

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీలో కంటెస్టెంట్స్ మధ్య ప్రజెంట్ కెప్టెన్సీ ఫైట్ నడుస్తోంది. ‘బిగ్ బాస్’ కెప్టెన్సీ కోసం ఇచ్చిన టాస్కు ఈ సారి చాలా డిఫరెంట్ గా ఉంది. ‘బిగ్ బాస్’ ఇచ్చిన టాస్కు, కంటెస్టెంట్స్ రియాక్షన్స్ కు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. సదరు ప్రమో నెట్టింట తెగ వైరలవుతోంది. రాత్రి 9 గంటలకు ఈ ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీల్ స్ట్రీమ్ కానుంది.

‘బిగ్ బాస్’ ఇచ్చిన టా‌స్క్‌ను బిందు మాధవి చదివి వినిపించింది. ‘బిగ్ బాస్’ కెప్టెన్ కావడానికి తోటి సభ్యుల మద్దతు కూడా ముఖ్యం. కాబట్టి.. ఈ సారి కెప్టెన్సీ టాస్కులో భాగంగా ‘బిగ్ బాస్’.. ‘యూ ఆర్ నాట్ మై కెప్టెన్’.. టాస్క్ ఇచ్చింది. కంటెస్టెంట్స్ రీజన్స్ చెప్పి ఎవరు యూ ఆర్ నాట్ మై కెప్టెన్ అనేది చెప్పాలి.ఈ క్రమంలోనే వారు బాణాలను గుచ్చాలి.

అలా కెప్టెన్సీ దగ్గరి వరకు వచ్చిన శివపైన కంటెస్టెంట్స్ కొందరు ‘యూఆర్ నాట్ మై కెప్టెన్’ అని చెప్పేశారు. శివ అషురెడ్డిని కెప్టెన్సీకి మద్దతివ్వాలని కోరాడు. అయితే, అషురెడ్డి మరి నాకెంటీ అని అడిగింది. మొత్తంగా ఒకరి తర్వాత మరొకరు కంటెస్టెంట్స్ శివను ‘యూ ఆర్ నాట్ మై కెప్టెన్’ అని సెలక్ట్ చేశారు.

ద లేజియెస్ట్ పర్సన్ ఇన్ హౌజ్ శివని అరియానా అన్నట్లు ప్రోమోలో స్పష్టమవుతోంది. ముమైత్ ఖాన్ ను ‘యూఆర్ నాట్ మై కెప్టెన్’ అని మహేశ్ బాణాలు గుచ్చబోతుండగా, ముమైత్ వద్దని గోల గోల చేసింది. ఇంతకీ కెప్టెన్ ఎవరవుతారు? అనేది తెలియాలంటే.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో రాత్రి 9 గంటలకు స్ట్రీమ్ కానున్న బిగ్ బాస్ చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news