Big Boss OTT Non Stop: ముమైత్ ఖాన్‌తో ప్రేమలో పడిపోయిన శివ.. కంటెస్టెంట్స్ ఫస్ట్ ‘లవ్ స్టోరి’స్ రివీల్..

-

బిగ్ బాస్ ఓటీటీ షోలో కంటెస్టెంట్స్ కు ‘బిగ్ బాస్’ క్రేజీ టాస్ట్ ఇచ్చారు. తమ ఫస్ట్ ‘లవ్ స్టోరి’ అనగా.. తమ మనసు తలుపు తట్టిన ‘తొలి ప్రేమ’ సంగతులు షేర్ చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా వచ్చి తమ ప్రేమ మధురానుభూతులను షేర్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ నిర్వాహకులు విడుదల చేయగా, అది నెట్టింట ట్రెండవుతోంది.

సృష్టిలో ప్రేమ అనిర్వచనయమైన మధుర అనుభూతి అని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే ప్రతీ ఒక్కరి జీవితంలో తమ తొలి ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. తాము ఉన్నంత కాలం ప్రతీ ఒక్కరికి తమ ఫస్ట్ ‘లవ్ స్టోరి’ గుర్తుంటుంది. నటరాజ్ మాస్టర్ తన ఫస్ట్ లవ్ స్టోరిని చాలా ఫన్నీగా చెప్పాడు. తాను ప్రేమించబోనని, పెళ్లి చేసుకోబోనని, చూసిన పది నిమిషాలలోనే అని అనగానే.. కంటెస్టెంట్స్ డబుల్ మీనింగ్ అర్థాలు వచ్చేలా సౌండ్ చేశారు.

ఇంతలోనే ‘అర్జున్ రెడ్డి’ ఫిల్మ్ బీజీఎం రాగా, అందరూ నవ్వేశారు. అలా నటరాజ్ మాస్టర్ తన ఫన్నీ ‘లవ్ స్టోరి’ రివీల్ చేశారు. శివ తన తొలి ప్రేమ గురించి వివరించే క్రమంలో బిందు మాధవి కలగజేసుకుంది. ‘నువ్వు ప్రతీ ఒక్కరికి ఐ లవ్ యూ చెప్తావా?’ అని బిందు మాధవి అడిగింది. దానికి శివ అవును .. అని సమాధానమిచ్చారు. అలా చెప్తున్న క్రమంలోనే తనకు ఐ లవ్ యూ చెప్పు అని ముమైత్ ఖాన్ అడిగింది. ‘ఐ లవ్ యూ ముమైత్ ఖాన్’ అని శివ చెప్పగా, ‘ఐ లవ్ యూ టూ’ శివ అని ముమైత్ చెప్పంది. అలా ముమైత్ ఖాన్ , శివల ‘తొలి ప్రేమ’ చిగురించింది.

ఇక ‘బిగ్ బాస్’ ఓటీటీ క్వీన్ గా పిలవబడుతున్న బిందు మాధవి తన ఫస్ట్ లవ్ స్టోరి బ్రేకప్ అయిందని చెప్తూ తాను ఇక్కడ ఉండటానికి కారణం అతనే అని పేర్కొంది. అలా కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు తమ లవ్ స్టోరిలు షేర్ చేసుకున్నారు. ఎవరెవరి లవ్ స్టోరి ఎంత డీప్ గా ఉంది అనేది వివరంగా తెలియాలంటే శుక్రవారం రాత్రి 9 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news