కృష్ణంరాజు అంత్యక్రియల్లో బిగ్ ట్విస్ట్..తలకొరివి పెట్టేది ఎవరంటే !

నేడు టాలీవుడ్‌ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజు గారి అంత్యక్రియలు జరుగనున్నాయి. కనకమామిడి ఫామ్‌హౌస్‌లో అధికార లాంఛనాలతో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు చేవెళ్ల, మొయినాబాద్ దగ్గర లోని కనక మామిడి ఫామ్ హౌస్ లో మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజు గారి అంత్యక్రియలు జరుగుతాయి.

ఆయన ఇంటి నుండి ఇవాళ ఉదయం 11:30 గంటలకు పార్థివదేహం బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా.. కృష్ణంరాజు అంత్యక్రియల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్నటి వరకు అందరూ కృష్ణం రాజుకు తలకొరివి పెట్టేది ప్రభాసే అనుకున్నారు. కానీ చివరి క్షణంలో.. కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పు చోటు చేసుకుంది. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా కృష్ణం రాజు అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది. అలాగే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. అంతేకాదు..కృష్ణం రాజు అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు మాత్రమే అనుమతి ఉండనుంది.