బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్.. హగ్గులు, కిస్సులతో అదరగొట్టిన హారిక?

బిగ్ బాస్ సీజన్ 4 రెండో వారం నుంచి ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్, ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. ముఖ్యంగా మోనాల్, అభిజిత్, అఖిల్ మధ్య ప్రేమాయణం వీక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. బిగ్ బాస్ మంగళవారం ఇచ్చిన టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ తమలోని టాలెంట్ ను బయటపెట్టారు. అఖిల్ మోనాల్ పై ప్రేమతో కారం దోశె వెయించుకొని తీసుకొని రాగా అప్పటికే అభిజిత్ అక్కడ ఉండటంతో తినిపించలేకపోయాడు.

మోనాల్ దగ్గడంతో వెంటనే వాటర్ బాటిల్ ను అందించి ఆ తరువాత అభిజిత్ ఏం చెప్పినా తనకు చెప్పొద్దని అఖిల్ మోనాల్ కు సూచించాడు. అయితే మోనాల్ కు లాస్య, సుజాత చిన్న షాక్ ఇచ్చారు. ఎప్పుడు చూసినా అఖిల్ లేదా అభిజిత్ తో మాట్లాడుతుండటం వల్ల తమకు మోనాల్ తో మాట్లాడేందుకు సమయం దొరకట్లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సాయి తొలి వారంలోనే నామినేషన్ లోకి వెళ్లిపోవడంతో ముభావంగా ఉన్నారు.

బీబీ టాలెంట్ షోలో భాగంగా కంటెస్టెంట్లు డ్యాన్స్ ఫెర్పామెన్స్ లు అదరగొట్టారు. నోయల్, లాస్య జడ్జీలుగా అరియానా యాంకర్ గా వ్యవహరించారు. బీబీ టాలెంట్ షోలో భాగంగా సొహైల్, మోనాల్ కలిసి వానా వానా వెల్లువాయె పాటకు డ్యాన్స్ చేశారు. అఖిల్ కమాన్ కమాన్ అంటూ మోనాల్ ను ప్రోత్సహించటం గమనార్హం. సినిమా చూపిస్త మామా పాటకు అమ్మ రాజశేఖర్ సోలోగా డ్యాన్స్ చేయగా కళ్యాణి, దివి కూడా ఈ పాటలో డ్యాన్స్ వేశారు.

టాప్ లేచిపోద్ది సాంగ్ తో మెహబూబ్, హారిక అదరగొట్టారనే చెప్పాలి, డ్యాన్సులు, కిస్సులతో నిజంగానే టాపు లేపేశారు. గంగవ్వ మీ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు పాట పాడి అలరించింది. ఇకపోతే బిగ్ బాస్ మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో కొత్త కంటెస్టెంట్ ఎంట్రీ ఉండబోతుంది. మొదటి నుంచి వినిపిస్తున్న ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం.