నేను బ్రతికే ఉన్నాను.. అది చెప్పడానికే హౌస్ లోకి వెళ్లా..

బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ ప్రారంభమై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే తెచ్చుకుంటుంది. హౌస్ లో ఎక్కువ మంది జనాలకి తెలియని వారే ఉన్నా కూడా ఇప్పుడిప్పుడే ఆసక్తిగా మారుతుంది. ఐతే బిగ్ బాస్ లో మొదటి ఎలిమినేషన్ గా సూర్యకిరణ్ హౌస్ నుండి బయటకి వెళ్ళిపోయాడు. సత్యం సినిమా డైరెక్టర్ ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాడు. ఐతే హౌస్ నుండి బయటకి వచ్చిన అనంతరం ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్యకిరణ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

తానెందుకు హౌస్ లోకి వెళ్లానో కారణం చెప్తూ, సత్యం సినిమా తర్వాత తాను సినిమాలు చేసినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో చెన్నై వెళ్లిపోయాడట. ఆ విషయం తెలియని చాలా మంది సూర్యకిరణ్ చనిపోయాడనే అనుకున్నారట. అలా అనుకున్నవారికి తాను బ్రతికే ఉన్నాను అని చెప్పడానికే హౌస్ లోకి వెళ్లానని చెప్పుకొచ్చాడు. ఇంకా హౌస్ లో కంటెస్టెంట్లు అందరూ చిన్న విషయాలకే మరీ ఎక్కువ చేస్తున్నారనీ, ఫుటేజ్ కోసం డ్రామా చేస్తున్నారని, హౌస్ లో ఉన్నంతసేపూ యాక్టింగ్ చేస్తున్నారని అన్నాడు.