బిగ్ బాస్: చలాకి చంటికి ఊహించని షాక్ ఇచ్చిన హౌస్ మేట్స్..!

-

బిగ్ బాస్ లో వారాంతం వచ్చిందంటే చాలు హంగామా రెట్టింపు అవుతుంది. ఎందుకంటే వారం చివర్లో నాగార్జున కనిపించడం.. ఆ తర్వాత హౌస్ మేట్స్ ను తనదైన శైలిలో ఆడుకుంటూ ఉంటారు. ఇక శని, ఆదివారాల్లో నాగార్జున చేసే సందడి అంతా కాదు. ఇక కంటెస్టెంట్స్ ను ముప్పతిప్పలు పెట్టి వారు చేసిన తప్పులను చూపిస్తూ ఉంటారు. ఎప్పటిలాగే నిన్న ఎపిసోడ్లో నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ కు క్లాస్ పీకారు. అంతేకాదు చలాకి చంటి కి మాత్రం ఊహించని షాక్ ఇచ్చారు నాగార్జున.. అసలేమైంది అనే విషయానికి వస్తే సీజన్ సిక్స్ మొత్తంలో చంటి కెప్టెన్ అయ్యే అవకాశం లేదని తేల్చి చెప్పారు. హౌస్ లో ఒకే తప్పు నలుగురు చేసినప్పటికీ హౌస్ మేట్స్ ఓట్ల ప్రకారం శిక్ష చంటి కే పడింది . దాంతో కెప్టెన్సీ పదవి నుంచి చంటి తప్పుకోవాల్సి వచ్చింది.

టాస్క్ లో భాగంగా అందరికీ రూ.5 వేల చొప్పున డబ్బులు ఇచ్చారు నాగ్.. చివరిగా ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళు విజేత అని ప్రకటించారు. అయితే నలుగురి దగ్గర ఒక రూపాయి కూడా మిగల్లేదు వారిలో ఆదిరెడ్డి, చంటి, ఇనయ, బాలాదిత్య ఉన్నారు. ఇక వీరిలో ఒకరికి ఈ సీజన్ లో కెప్టెన్సీ రేస్ లో ఉండే అవకాశం లేదు అని నాగార్జున చెప్పారు .. ఇక హౌస్ లో ఉన్నవారు ఈ నలుగురికి ఓట్లు వేయాలని చెప్పడంతో బాలాదిత్యాకు ఎవరు ఎక్కువ ఓట్లు వేస్తారు అని అడగ్గా ఒకరు కూడా చేయి ఎత్తలేదు. దీంతో ఆయన సేఫ్ అయ్యాడు.. ఆ తర్వాత ఆదిరెడ్డికి రేవంత్ ఒక్కడే చేయి ఎత్తాడు. ఇనయ, చంటి కి చేరి మూడు ఓట్లు పడ్డాయి.. అయితే కెప్టెన్ కీర్తి చంటి కి ఓటు వేయడంతో కెప్టెన్సీ రేస్ అర్హత కోల్పోయాడు చంటి.

అప్పుడు నాగార్జున.. ఇప్పుడు నీ విశ్వరూపం చూపించే సమయం వచ్చిందంటూ చంటి కి చెప్పాడు .. నువ్వేంటో చూపించు నీ ఆట ఏంటో చూపించు అని చెప్పగానే కచ్చితంగా చూపిస్తాను అని చంటి చెప్పాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ కూడా బాగా వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news