బిగ్ బాస్: హోస్ట్ చేతిలో భారీగా చివాట్లు తిన్న గీతూ..కారణం..?

బిగ్ బాస్ శనివారం నాటి ఎపిసోడ్లో నాగార్జున ప్రతి ఒక్కరి మాటలకు రిప్లై ఇచ్చాడు. ముఖ్యంగా సీరియస్ ఫేస్ తో కౌంటర్ల మీద కౌంటర్లు వేశాడు. అంతేకాదు అందరినీ దారుణంగా అనేశాడు. ముఖ్యంగా గీతూ నోటి దూల డెఫినేషన్ ఆమెతోనే చెప్పించాడు.. ఇక తనకు నచ్చని రేవంత్ , ఇనయాలది నోటి దూల అంటూ గీతూ నోరు పారేసుకుంది . ఇక ఇదే విషయాన్ని తిప్పి నాగార్జున కౌంటర్ వేశాడు. మూడవ వారంలో అడవిలో ఆట టాస్క్ జరిగిన సమయంలో జరిగిన అన్ని విషయాలను బయటకు తీసి మరీ కంటెస్టెంట్లను ఒక ఆట ఆడుకున్నాడు నాగార్జున.

ఇక ఈ క్రమంలోనే ఇనయ , శ్రీహాన్ మధ్య గొడవ వచ్చినప్పుడు తప్పు శ్రీహాన్ దే అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక సమస్య మీ ఇద్దరి మధ్య ఉన్నప్పుడు మధ్యలో గీతూ ఎందుకు వచ్చిందని కూడా అడిగాడు. ఇక నామినేషన్ టైంలో నన్ను ఇనయా మాట్లాడనివ్వలేదు అందుకే అప్పుడు రివేంజ్ తీర్చుకున్నాను సార్ అంటూ గీతూ చెబుతుంది.. దానికి నాగార్జున దీన్నే నోటి దూల అంటారు అంటూ కౌంటర్ వేశాడు. ఇక రేవంత్ కి నోటి దూల ఉందని అంటున్నావ్.. నీకు భయంకరమైన నోటి దూల ఉందని గీతూ పరువు తీసాడు నాగార్జున.. ఆట బాగా ఆడుతున్నావు కానీ మాటలు జాగ్రత్త అని దోబ్బెయ్ అనే పదాన్ని మళ్లీ గుర్తు చేశాడు.

రేవంత్ ని కూడా.. వాడు అని అంటే కొట్టేస్తావా ? అని రేవంత్ వీడియోని చూపించాడు. దీంతో రేవంత్ కూడా చల్లబడ్డాడు. ఆ తర్వాత ఇనయాకు సారీ కూడా తెలిపాడు. ఇక అలా శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున అన్ని లెక్కలు సెట్ చేశారు. ఇక ఆట బాగా ఆడడం లేదన్న కారణంతో మొదటిసారిగా నాగార్జున.. అర్జున్, కీర్తి లను మెజారిటీ ఓట్ల ఆధారంగా వచ్చేవారం నామినేట్ చేశాడు. అంతేకాదు ఆరోహీ, సూర్యలకు సంబంధించిన ఒక రొమాంటిక్ ఫోటోలు చూపించి అందరిలోనూ అనుమానాలను రెకేత్తించాడు నాగార్జున. ఇక అలా శనివారం నాటి ఎపిసోడ్ ముగిసింది.