Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్.. ఈ షోలో విభిన్న అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు ఒకేచోట కలిసి ఉండే షో.. ఏ ఒక్కరి ఆలోచనలు, అభిప్రాయాలు అసలూ ఒకేలా ఉండవ్. అందుకే చిన్న చిన్న వాటికే గొడవపడుతుంటారు. అభిప్రాయాలు కలిస్తే.. వారి మధ్య స్నేహం పుడుతుంది. అది కాస్త ముదురుతే.. ప్రేమ చిగురిస్తుంది. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్‌ల్లో ఎన్నో ప్రేమ కథలు చిగురించాయి. కొందరిది వన్ సైడ్ లవర్ స్టోరి అయితే.. మరికొందరిది సక్సెక్ పుల్ లవ్ స్టోరీ గా మారుతుంటాయి. వారి ఘాటు రోమాన్సతో హౌస్ ను హీట్ ఎక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇక.. తాజా సీజన్లో కూడా ప్రేమలు వెల్లువిరిశాయి. కాస్త హద్దులు దాటుతున్నట్టే అనిపిస్తోంది. ఫస్ట్ రెండు మూడు వారాల్లో హమీదా- శ్రీరామ్ ల జంట లవ్ ట్రాక్ నడిపిస్తే, మరోసైడ్ మానస్ అండ్ పింకీల స్నేహం కూడా కాస్త హద్దుమీరుతోంది. కానీ, హామీదా- శ్రీరామ్ ల లవ్ సోర్టీకి మిడిల్ లోనే ఎండ్ కార్డు వేశారు బిగ్ బాస్. ఇక పింకీ – మాసస్ లవ్ సోర్టీ చాలా ఘాటుగా సాగుతోంది. మూడు కిస్ లు .. ఆరు హాగులతో చాలా రోమాంటిక్ గా సాగుతుంది.
మొదట్లో మానస్.. అసలూ పింకీని పట్టించుకునే వాడు కాదు. కానీ పింకీ మాత్రం అవసరం ఉన్నా లేకున్న
మానస్ దగ్గరకు వచ్చి.. ప్రేమను కురిపించేది. ఏదో వీక్ మూమెంట్లో మానస్ మనస్సు కరిగిపోయింది. దీంతో పింకీ ఇంకా ఓపెన్ అయింది. అవకాశం దొరికితే. చాలు మానస్ ను ముద్దులతో ముంచెత్తుతోంది. అది చాలదన్నట్టుగా బిగి కౌగిళ్ళతో సేద తీర్చుతోంది.
అయితే.. మానస్ మాత్రం ఈ విషయంలో చాలా సార్లు పింకీని హెచ్చరించారు. అతడు తన పరిథిని గుర్తించే మెలగుతున్నాడు. పింకీ ఎప్పుడైనా కాస్తంత ఓవర్ అయినా.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు. హద్దులు పెడుతూనే ఉన్నాడు. కానీ ప్రియాంక మాత్రం హద్దుల్ని చెరిపేసే ప్రయత్నం చేస్తోంది.
ఇక నామినేషన్స్ లో పింకీ భాగంగా రవిని సేఫ్ చేసినందుకు మానస్ చాలా పర్సనల్ గా తీస్కున్నాడు. నిజానికి హౌస్ లో నాపై వీరిద్దరూ కలిసి స్కెచ్ గీశారా అనే అనుమానం కూడా కలిగింది. దీంతో మార్నింగ్ నిద్ర లేవగానే పింకీని దూరం పెట్టేశాడు. దీంతో బుంగమూతి పెట్టుకున్న పింకీ కారణం చెప్పమని.. పదే పదే వెంట పడింది. అయినా మానస్ గుండె కరగలేదు.
ఎలాగైనా మానస్ తనతో మాట్లాడాలని .. అన్నం కలుపుకోని మానస్ దగ్గరకు వెళ్లింది. ముద్ద కావాలా ముద్దు కావాలా అంటూ మానస్ పై గారాలు వలక పోయింది పింకీ. ఓ వైపు ముద్దు పెడుతూ.. మరోవైపు ముద్దలు నోట్లో పెట్టింది. ఇక ఓవర్ చేయకు అంటూ మానస్ వార్నింగ్ ఇచ్చేసరికి ఆపేసింది. ఈ తతంగం మొత్తాన్ని చూస్తున్న కాజల్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేసింది. ఈ రోమాంటిక్ మూమెంట్ ను చూసిన షన్ను, రవి షాక్ అయ్యారు. కాసేపు వారిలా ఇమిటేట్ చేస్తూ హౌస్ మేట్స్ ని నవ్వించాడు.