బిగ్ బాస్ కు భారీ షాక్.. మొదటిసారి అలా..!!

-

బిగ్ బాస్ తెలుగులో మంచి ప్రావీణ్యం పొందిన రియాల్టీ షో అని చెప్పవచ్చు. అయితే ఎప్పటిలాగే గత వారంలో బిగ్ బాస్ సీజన్ 6 చాలా గ్రాండ్ గా విడుదల చేశారు. ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున చేస్తున్నారు. ఇక ఆదివారం రోజు ఒక్కొక్క కంటెస్టెంట్ ను నాగార్జున పరిచయం చేస్తూ వారి వ్యక్తిగత రహస్యాలను కూడా తెలియజేస్తూ.. వారు బిగ్ బాస్ స్టేజ్ వరకు రావడానికి గల కారణాన్ని అడుగుతూ హౌస్ లోపలికి పంపించడం జరిగింది. ఇక ఇప్పటికే 21 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి చేరుకున్నారు. ఇక వారిలో ఒక కపుల్ కూడా ఉంది. ఇకపోతే ఈ సీజన్ మొదలై వారం రోజులు గడిచింది. అయితే బిగ్ బాస్ 6 పై జనాలు ఇంట్రెస్ట్ చూపించడం లేదనే వార్త బాగా వైరల్ గా మారుతుంది.

నిజానికి ఈ షో గత ఐదు సీజన్ లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని మంచి టిఆర్పి రేటింగ్ ను కూడా సొంతం చేసుకుంది . కానీ ఈసారి సీజన్ 6 పై ఎన్నో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ కంటెస్టెంట్ లు ఎవరు ? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ? అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ ట్రోలింగ్ చేసేస్తున్నారు. ముఖ్యంగా సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ వీక్ గా ఉండడంతో పాటు నాగార్జునలో కాస్త స్ట్రైలింగ్ అండ్ ఎనర్జీ కూడా తగ్గినట్లు కనిపించింది. అంతేకాదు హౌస్ లో ఏం జరుగుతుందో ప్రేక్షకులు ముందుగానే గ్రహిస్తున్నారు. అంతేకాదు మరొకవైపు వైల్డ్ కార్డు ఎంట్రీ తో మంచి సెలబ్రిటీలను తీసుకు రావడంతోపాటు నాగార్జున హోస్టింగ్ స్క్రిప్ట్ ను కూడా మార్చాలి అని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

దీనిపై దృష్టి పెట్టకపోతే ఇక బిగ్ బాస్ పని అయిపోయినట్టే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బుల్లితెరపై నాగార్జున ఇమేజ్ చెల్లిపోయిందా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ ఎలాంటి మార్పులు చేస్తుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news