Bigg Boss 5 Telugu: ఎంట్రా ష‌ణ్ణూ ఇదీ.. స్ట్రాట‌జీ మార్చావా..? మ‌రీ క‌నెక్ట‌య్యావా??

బిగ్ బాస్ 5 తెలుగు 10 వారాలు గ‌డిచిపోయాయి ఇంకో నాలుగు వారాల్లో విన్న‌ర్ ఎవ‌రో తేలబోతుంది. బిగ్ బాస్ 5 సీజ‌న్ మొద‌ల‌యిన‌ప్ప‌టి నుంచి యాపిల్‌బాయ్ మోజో రూమ్‌లో ముచ్చ‌ట్లు త‌ప్ప పెద్ద‌గా చేసిందేం లేదు.. ఎవ‌రో ఒక‌రు గెలికితేనే గేమ్ అంటూ మొద‌లెడ‌తాడు.

యాంక‌ర్ ర‌వి అంద‌రినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కానీ ఈ బాబున్నాడు చూడండీ ఏకంగా బిగ్ బాస్ చూస్తున్నవారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఎలాగంటారా..? ష‌ణ్ణు అండ్ కో త‌ప్ప అంద‌రూ నాట‌కాలాడ‌టానికి వ‌చ్చిన‌ట్లు తాము మాత్ర‌మే నిజాయితీగా ఉన్నామ‌న్న‌ట్లు జీవించేస్తున్నారు.. ఒక‌ర్ని మించి ఒక‌రు.. ఎవ‌రు ఎందుకు ఎడుస్తున్నారో అర్థం కావ‌ట్లా అంటూ పోస్టుమార్ట‌మ్ చేసేస్తూ మ‌రీ ఓవ‌ర్ యాక్ష‌న్స్ చేస్తున్నాడంటూ విమ‌ర్శిస్తున్నారు ప‌బ్లిక్‌. బాబును ర‌గ‌డ సినిమాలోని సీన్స్తో జ‌త చేస్తూ ఏకిపాడేస్తున్నారు.

గ్రూపుగా ఆడుతున్నారంటూ ఏడ్చే మ‌న బాబే గ్రూపులు మొద‌లెట్టింది. ష‌ణ్ణు, సిరి, జెస్సి.. దాంట్లో మ‌నోడు బ్ర‌హ్మ‌..

జెస్సీని పెద్ద త్యాగ‌మూర్తి అన్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇచ్చిన షణ్ణుకి నాగార్జున వంత‌పాడాడు. నిజంగా జెస్సీ త్యాగం చేశాడా..? వెళ్తూ వెళ్తూ ఒక‌రిని సేవ్ చేశాడా?? ఆరోగ్యం బాగోలేక వెళ్ళాడేగానీ సిరినీ కాపాడదామ‌నో, షణ్ణుని బ‌య‌ట నుంచి చూద్ద‌మ‌నో రాలేదు క‌దా.. మ‌రి ఈ ఓవ‌ర్ బిల్డ‌ప్ ఎంటో మ‌న‌ యూట్యూబ‌ర్ కే తెలియాలి.

ఇక క్యారెక్ట‌ర్ క్యారెక్ట‌ర్ అంటూ ఎవ్వ‌రికీ క్యారెక్ట‌ర్ లేదంటూ తేల్చేసే ఓ బ్ర‌హ్మ‌నందం.. నీతో క్లోజ్‌గా ఉండే సిర క్యారెక్ట‌ర్ గురించి కామెట్లు చేశావ్‌, ఇంక కాజ‌ల్‌, స‌న్నీ , ప్రియాంక ఇలా అంద‌రి క్యారెక్ట‌ర్లు ఎంటో డిసైడ్ చేస్తూ ప‌బ్లిక్ మైండ్‌లోకి ఎక్కించే ప్ర‌య‌త్నం చేస్తావ్‌. ఇన్ని రోజులూ సిరిని తోడుగా(?) పెట్టుకొని సిరి తో అవ‌స‌రంలేద‌నుకున్నావా ఆమె మీద కూడా ఒక ముద్ర వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నావా…?

అప్ప‌డం చేస్తే వ‌స్తా.. వ‌స్తా.. అంటూ బాగా ఎమోష‌న్ అయిపోయావ్‌… స‌న్నీని అన్న‌య్యా అని పిల‌వ‌మ‌న్నావ్‌.. తాను పిల‌వ‌క పోతే తెగ ఇదైపోయావ్‌… వై.. వై.. వై.. అదేదో నిన్నే అన్న‌య్యా అని పిల‌వ‌మంటే పోయేది.. అప్పుడు స‌న్నీ అయినా యానీ అయినా ఎవ‌రైనా సిరిని ఎమైనా అంటే నువ్వు చూసుకునే వాడివి క‌దా..?? అన్న అనిపించుకుంటే లాస్ట్ పేరాకి కూడా వివ‌ర‌ణ అవ‌స‌రం లేదుగా… అంతేగా..!!

ప‌ది వారాల‌కు దీప్తి గుర్తొచ్చిందంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నావ్ ఎందుకు..? వేరే వాళ్లు ఏడిస్తే ఏడుపు ఎలా వ‌స్తుందిరాబాబూ అంటావ్‌..? అదో స్ట్రాట‌జీ అంటావ్‌..? యాక్టింగ్ అంటావ్‌..?? మ‌రి నువ్వు చేసేది ఏంటి బాబూ రావ్‌..

19 మంది ఉన్న‌ప్పుడు ఒక బెడ్‌పై ప‌డుకుంటే కెమెరాలు క‌నిపెట్ట‌వా..?? 10 మందిలో కెమెరాల‌కు దొరికేస్తామా.? ఎంటి షణ్ణూ ఈ డైలాగులు…?? ఇవి విన్న‌వారెవ‌రైనా త‌ప్పుగా అర్థం చేసుకోరా..? ముందు నుండి ఉన్న‌ట్లే ఇప్పుడూ ఉంటే త‌ప్పేంది.. త‌ప్పు చేస్తే క‌దా దొరికిపోతామంటూ భ‌య‌ప‌డేది.. సో ఏమాత్రం భ‌య‌ప‌డ‌కు అదీ త‌ప్పు చేయ‌క‌పోతే..?