సిరిసిల్లలో ఈతకు వెళ్లి 6 గురు విద్యార్థులు మృతి : రూ.5 లక్షలు ప్రకటించిన కేటీఆర్

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు రోజుల కింద ఈతకు వెళ్లి… ఎనిమిది మంది విద్యార్థులు గల్లంతు అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈతకు వెళ్లి గల్లంతైన వారిలో కేవలం ఆరు గురు విద్యార్థుల మృత దేహాలు లభ్య మయ్యాయి. సిరిసిల్ల అర్బన్ రాజీవ్ నగర్ లో మానేరు వాగులో ఈత కు వెళ్లి ఈ విద్యార్థులు చనిపోయారు.

అయితే.. తాజాగా మృతి చెందిన ఆరుగురి విద్యార్థుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు సిరిసిల్లా ఎమ్మెల్యే, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. పరామర్శించడమే కాకుండా ఒక్కొక్క బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందించారు మంత్రి కేటీఆర్. వర్కర్స్ టూ ఓనర్ పథకం కింద శ్రీరాము, క్రాంతి కుమార్ కుటుంబానికి రెండు పవర్ లూం జోడీలు సాంక్షన్ చేయాలని అధికారులకు ఆదేశించారు కేటీఆర్‌. మరోసారి ఇలాంటి ఘటనలు పునరా వృత్తం కాకుండా చూడాలని, అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్‌. విద్యార్థుల తల్లి దండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news