అప్పట్లోనే నాగార్జున-బాలయ్య కాంబోలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ఎందుకు ఆగిపోయిందంటే?

-

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వచ్చిన RRR పిక్చర్ ఎంతిటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూసి జనాలు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ జక్కన్న., దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వలనే ఈ మల్టీస్టారర్ సాధ్యమైందని చెప్పొచ్చు.

టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ రామ్ చరణ్, తారక్ ఇందులో కలిసి నటించారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా తారక్ నటించారు. విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి స్టోరి అందించగా, మ్యూజిక్ ఎం.ఎం.కీరవాణి అందించారు. అలా ఈ ఫిల్మ్ మల్టీస్టారర్ ట్రెండ్ కు శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. అయితే, అప్పట్లోనే ఈ మాదిరి ఓ భారీ మల్టీస్టారర్ మూవీ కోసం ప్లానింగ్ జరిగింది. అక్కినేని, నందమూరి ఫ్యామిలీ హీరోలు ఇందులో కలిసి నటించాలనుకున్నారు.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, నందమూరి నటసింహం బాలయ్య ఇందులో హీరోలుగా నటించాల్సి ఉంది. అక్కినేని, నందమూరి హీరోల మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ విదితమే. తెలుగు సినిమాకు రెండు కళ్లు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కుటుంబాలకు చెందిన హీరోలతో సినిమా చేయాలనుకున్నారు మేకర్స్. అలా మాలీవుడ్(మలయాళ) సూపర్ హిట్ పిక్చర్ ‘క్రిస్టియన్ బ్రదర్స్’ ను రీమేక్ చేయాలనుకున్నారు. ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్ ఈ మూవీ రైట్స్ తీసుకున్నారు.

ఈ పిక్చర్ స్టోరిని బాలయ్య, నాగార్జున ఇద్దరికీ వినిపించగా, వారు ఓకే చేసేశారు. అలా భారీ మల్టీస్టారర్ 2011లో స్టార్ట్ అయినట్లే అయింది. అయితే, ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్ ఈ సినిమా తీయడానికి రెడీ అయిపోయారు. కానీ, డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అలా దర్శకుడి కోసం ఎదురు చూశారు. అలా దర్శకుడి ఎంపిక ఆలస్యం అయిన నేపథ్యంలో ప్రాజెక్టు పక్కకు పోయింది. లేదంటే అప్పట్లోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా ‘క్రిస్టియన్ బ్రదర్స్’ తెలుగు రీమేక్ వచ్చేది. బాలయ్య ప్రస్తుతం తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తుండగా, నాగార్జున ‘ది ఘోస్ట్’ ఫిల్మ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news