బాలీవుడ్ ఈ తప్పులు చేసింది అందుకే నాశనం, విమర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య వ్యవహారం కాస్త సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ మరణం హత్య అని కొందరు ఆత్మహత్య అని మరికొందరు ఆరోపించారు. సిబిఐ కి కేసు అప్పగించినా సరే ఇప్పటి వరకు ఏ విధమైన ముందు అడుగు కూడా పడలేదు. ఈ తరుణంలో డ్రగ్స్ కేసు ఒకటి బయటకు వచ్చి సంచలనం సృష్టించింది. తాజాగా బాలీవుడ్ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

బాలీవుడ్ చేసిన తప్పులు బాలీవుడ్ ని నాశనం చేశాయని ఆయన పేర్కొన్నారు. 1) సుశాంత్ మరణంపై మౌనం. 2) నిరాశతో చనిపోయాడని సుశాంత్ ని నిందించడం. 3) అందరూ రియాని దోషిగా చూపించడం. 4) బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడేవారిపై మౌనం. 5) ఓటీటీలో సినిమాలను విడుదల చేయడం అని ఆయన ఆరోపించారు.