బ్రేకింగ్; ఇండియన్ 2 సినిమా ఆపేశారు…!

-

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం ఇండియన్ 2. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వస్తుంది అని భావించారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయింది. భారీ ప్రమాదం జరగడంతో చిత్ర షూటింగ్ ని ఆపేశారు. ఆ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పది మంది గాయపడ్డారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ని దాదాపుగా ఆపేసారని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ విషయంలో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దర్శకుడు శంకర్ కి మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. ఇటీవల ప్రమాదానికి కారణం నిర్మాణ సంస్థ అని దర్శకుడు శంకర్ ఆరోపించారు. శంకర్ కారణమని నిర్మాణ సంస్థ ఆరోపించింది. అటు కమల హాసన్ కూడా అదే విధంగా ఆరోపణలు చేసారు.

సినిమా మొదలైన నాటి నుంచి నేటి వరకు కూడా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో విధంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు షూటింగ్ ని ఆపేసారని అంటున్నారు. దర్శకుడు శంకర్ షూటింగ్ చేసే ఆలోచనలో లేరని సమాచారం. కమల్ హాసన్ కూడా ఈ సినిమాను చేయడానికి ముందుకి రావడం లేదని అంటున్నారు. మరి ముందుకి వెళ్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news