ప్రేక్షకులకు హీరో బంపర్ ఆఫర్..ఒక్క మెసేజ్‌తో ఫ్రీ టికెట్స్..

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం..తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుని డిఫరెంట్ సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు.

కిరణ్ అబ్బవరం, చాందిని జంటగా నటించిన తాజా చిత్రం ‘సమ్మతమే’. జూన్ 24న(శుక్రవారం) ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ పిక్చర్ ను థియేటర్స్ లోనే అందరూ చూడాలనే విషయమై కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా సూపర్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.

ప్రేక్షకులు, అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో ..థియేటర్ లో చూసి తన సినిమా ఎలా ఉందో తనకు చెప్పాలని కోరుతున్నారు హీరో కిరణ్. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియో ద్వారా ఓ మెసేజ్ ఇచ్చాడు కిరణ్. ఫస్ట్ డే ఫస్ట్ షో..టికెట్ రేట్ల విషయమై ఏదేని ఇబ్బందులు ఎదురైతే తనకు ఇన్ స్టా గ్రామ్ ద్వారా మెసేజ్ పంపిస్తే చాలు..తను ఫ్రీగా టికెట్స్ పంపిస్తానని తెలిపాడు.

అభిమానులు తన సినిమాను మొదటి రోజున చూసి ఎలా ఉందో చెప్తే చాలా బాగుంటుందని తాను భావిస్తున్నానని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు. గోపీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపైన హీరో కిరణ్ అబ్బవరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)