ఛాలెంజింగ్ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రావుర‌మేశ్‌..

ఇక్క‌డ ఎవ‌డి మ‌న‌సు ఆడికి కోర్టు.. ఎవ‌డి మాట ఆడికి తీర్పు లాంటి డైలాగుల‌తో పాత్ర‌ను మ‌రో లెవ‌ల్ లోకి తీసుకెళ్లే వ్య‌క్తి రావుర‌మేశ్‌. ఆయ‌న ఏ పాత్ర చేసినా.. దాని వేరియేష‌న్ వేరేలా ఉంటుంది. కొన్ని సినిమాల‌కు ఆయ‌న పాత్రే హైలెట్ గా ఉంటుందంటే.. ఆయ‌న న‌టానా శైలి గురించి అర్థం చేసుకోవ‌చ్చు. విల‌న్ పాత్ర అయినా, తండ్రి పాత్ర అయినా.. ఇన్ స్పైరింగ్ పాత్ర అయినా.. ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. అది ఎమోష‌న్ సీన్ చేసినా, సీరియ‌స్ యాక్ష‌న్ సీన్ చేసినా.. ఆయ‌న డైలాగుల వ‌ర‌ద పారుతూనే ఉంటుంది.


ఇప్ప‌టికే ఎన్నో పాత్ర‌లు చేసి మెప్పించిన ఆయ‌న తాజాగా మ‌రో ఛాలెంజింగ్ పాత్ర చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. శ‌ర్వానంద్‌, సిద్ధార్థ క‌లిసి న‌టిస్తున్న సినిమాలో రావుర‌మేశ్ ఓ గూనివాడిగా క‌నిపించ‌బోతున్నాడంట‌. అంగ‌వైక‌ల్యం ఉన్న పాత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న న‌టించ‌లేదు. మొద‌టిసారి అలాంటి పాత్ర‌ను చేయ‌బోతున్నాడంట‌.
ఈ మ‌ధ్య ఇలాంటి పాత్ర‌లు చేసి మెప్పిస్తున్నారు న‌టీన‌టులు. రామ్ చరణ్ లాంటి హీరో కూడా చెవిటి వాడిగా న‌టించి మెప్పించాడు. ఇప్పుడు రావుర‌మేశ్ ను కూడా డైరెక్ట‌ర్ అజయ్ భూపతి ఓ గూనివాడిగా చూపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఈసినిమాలో ప్ర‌తి పాత్ర మెస్మ‌రైజ్ చేసేలా ఉంటుంద‌ని డైరెక్ట‌ర్ ఇప్ప‌టికే చెప్పేశాడు. చూడాలి మ‌రి ఎలాంటి పాత్ర‌లో రావుర‌మేశ్ మెప్పిస్తాడో.