ప్రశాంత్ కిషోర్ పై టీడీపీ సీనియర్ ప్రశంశలు…!

“బెంగాల్,తమిళనాడులో ప్రశాంత్ కిషోర్ టీంలే గెలిచాయి. Mamata Banerjee ను Bharatiya Janata Party (BJP) ఎంత టార్గెట్ చేసినా పీకే ఎత్తుల ముందు వారి పాచికలు పారలేదు.దేశంలోనే ఆమె వీరనారిగా గెలిచారు.తమిళనాడులోనూ పీకే స్ట్రాటజీనే పైచేయి సాధించి M. K. Stalin ను సీఎం చేస్తోంది.మొత్తంగా పీకే వ్యూహాలే విజేతలయ్యాయి.”

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన కామెంట్ ఇది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రశాంత్ కిషోర్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయినా సరే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పై ప్రశంసలు కురిపించడం వెనక కారణం ఏంటో చాలామందికి అర్థం కావడం లేదు. ప్రశాంత్ కిషోర్ పై టిడిపి నేతలు గత కొన్ని రోజులుగా ఆరోపణలు కూడా చేశారు. కానీ ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ ని ప్రశంసించడం తో అందరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.