అనిల్ రావిపూడికి కరోనా దెబ్బ మామూలుగా తగల్లేదుగా ..ఎఫ్3 ఇప్పట్లో లేనట్టేనట ..!

-

అనిల్ రావిపూడి కి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ రాలేదన్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రాం తో తెరకెక్కించిన పటాస్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు అన్ని మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకున్నాయి. చెప్పాలంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో సక్సస్ ఫుల్ డైరెక్టర్స్ గా రాజమౌళి, కొరటాల శివ తర్వాత ఆ క్రెడిట్ అనిల్ రావిపూడి మాత్రమే సాధించుకోగలిగాడు.

 

అయితే ఈ సక్సస్ ఫుల్ డైరెక్టర్ కి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడిందని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో ఇంతక ముందు అనిల్ రావిపూడి ఎఫ్ 2 ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోను చేరడం విశేషం. దాంతో ఈ మల్టీస్టారర్ కి సీక్వెల్ గా ఎఫ్ 3 ని నిర్మించాలని దిల్ రాజు ఇంతకముందే ప్లాన్ చేశాడు.

అయితే ప్రస్తుతం కరోనా తో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ సినిమా ఈ సంవత్సరం పట్టాలెక్కే అవకాశాలేమీ లేవని తాజా సమాచారం. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణం లో రూపొందిన వకీల్ సాబ్, వి సినిమాలు రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి. కాని ఆ సినిమాలు రిలీజ్ ఎప్పుడవుతాయో ఇంకా అర్థం కాని పరిస్థితి. దాంతో అనిల్ రావిపూడి ఎఫ్ 3 కి ముహూర్తం ఇప్పట్లో కుదరనట్టే. దానికి తోడు వెంకటేష్ ప్రస్తుతం నారప్ప కంప్లీట్ చేయాల్సి ఉంది. అలాగే వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాని కంప్లీట్ చేయాలి. ఇవన్ని ఒక కొలిక్కి వచ్చే సరికే 2021 వచ్చేస్తుందని అంటున్నారు. మొత్తానికి కరోనా అనిల్ రావిపూడికి గట్టి దెబ్బే వేసిందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news