ఆర్ ఆర్ ఆర్ నుండి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి ..!

-

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత భారీ మల్టిస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’. యంగ్ టైగర్ ఎన్.ట్.ఆర్ కొమరం భీం గా, మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజుగా శక్తి వంతమైన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటి ఆలియా భట్ నటిస్తుండగా సీనియర్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

 

అంతేకాదు ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ తో పాటు మరికొన్ని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటులు.. రే స్టీవెన్‌ సన్‌ ను, ఐరిష్ నటి అలిసన్ డూడీ లని ఎంచుకున్నారు రాజమౌళి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇటీవల కొన్ని మీడియా సమావేశాలలో పాల్గొంటు ఒక్కొక్క పాత్ర కి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడిస్తు సినిమా మీద బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అజయ్ దేవగణ్ ది కీలక పాత్ర అని సినిమాలో మంచి ట్విస్ట్ వచ్చే సమయంలో అజయ్ పాత్ర భారీ ప్రభావాన్ని చూపుతుందని రాజమౌలి వెల్లడించారు.

ఇక అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. కాకపోతే ఈ పాత్ర కేవలం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే సినిమాలో కనిపిస్తుందట. అయితే అజయ్ దేవగణ్ పాత్ర వల్లే ఎన్టీఆర్ – చరణ్ పాత్రలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాయని అజయ్ దేవగణ్ పాత్ర ఎంతో ప్రేరణాత్మకంగా ఉండనుందని తాజా సమాచారం. ఇక రీసెంట్ గా ఆలియా భట్ పాత్ర కూడా ఎన్టీఆర్ – చరణ్ పాత్రలను కలిపేదిగా ఉంటుందని రాజమౌళి రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news