RC 16 : బుచ్చిబాబుతో చరణ్‌ పాన్ ఇండియా మూవీ..అధికారిక ప్రకటన వచ్చేసింది

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 ఫిల్మ్ చేస్తు్న్నారు. ఈ పిక్చర్ నుంచి ఏదేని అప్ డేట్ కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. RRR ఫిల్మ్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ఇది.

కాగా, ఇందులో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. అయితే.. ఈ సినిమా ఫినీష్‌ కాకముందే.. మరో సినిమాకు చరణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

దర్శకుడు బుచ్చిబాబుతో చరణ్‌ సినిమా చేస్తున్నాడు. ఇవాళ దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. మైత్రీ మూవీస్‌ బ్యానర్స్‌ ఈ సినిమాను తెరక్కెస్తుంది. ఇక ఈ సినిమాలోని పాత్రలపై క్లారిటీ రానుంది. ఇక దీనిపై ఓ పోస్టర్‌ ద్వారా ప్రకటన చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.