ఆ పిచ్చి తోనే ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న కళ్ళు చిదంబరం..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి చాలామంది నటీనటులు ఇండస్ట్రీలో నటించాలన్న కోరికతో త్యాగాలకు పాల్పడిన విషయం తెలిసిందే. కొంతమంది ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలను కూడా వదిలేసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసుకొని స్టార్ హీరోలుగా మారిన వారు కొంతమంది ఉంటే మరికొంతమంది హాస్యనటులుగా తమ కెరియర్ను మొదలుపెట్టారు. ఇక అలాంటి వారిలో కళ్ళు చిదంబరం కూడా ఒకరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హాస్యనటులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈయన అసలు పేరు కొల్లూరి చిదంబరం. కానీ కళ్ళు అనే సినిమా ద్వారా ఎలా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు.

ఈ సినిమాలో గుడ్డివాడి పాత్రలో నటించడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక కెరియర్ తొలినాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన ఈయన ఆ తర్వాత కాలంలో స్టార్ కమెడియన్ గుర్తింపు తెచ్చుకున్నారు. కోటా శ్రీనివాసరావు తో కలిసి ఈయన చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేది. ఇక అమ్మోరు సినిమాలో కళ్ళు చిదంబరం పూజించిన పాత్ర ప్రేక్షకుల ఇప్పటికీ మర్చిపోలేరు. 1945 విశాఖపట్నంలో జన్మించిన 2015లో అక్టోబర్ నెలలో అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందారు. ఇకపోతే ఈయన కొడుకు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తండ్రి మరణం వెనుక అసలు విషయాన్ని వెల్లడించారు. కళ్ళ చిదంబరంకు మెల్లకన్ను రావడం వెనుక చాలా కథే ఉందని ఆయన తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కళ్ళు చిదంబరం ఒకవైపు నాటకాలలో చేస్తూనే మరొకవైపు ఉద్యోగం చేసేవారు. వైజాగ్ పోర్టులో ఈయన ఎంప్లాయ్ గా పని చేసేవారు. ఇక ఒకవైపు విజయవాడలో తన ఉద్యోగానికి అటెండ్ అవుతూనే మరొకవైపు సినిమాల కోసం హైదరాబాద్ అలాగే చెన్నై వెళ్లేవారు . ఇలా నిర్విరామంగా ఇలా పనిచేయడం వల్ల ఆయనకు సమయానికి నిద్ర కూడా ఉండేది కాదు అంటూ చిదంబరం కొడుకు కామెంట్లు చేశారు. ఇక సరైన సమయానికి నిద్ర, తిండి లేకపోవడం వల్ల కంటిలోని ఒక నరం పక్కకు జరగడంతో ఆయనకు కంటికి సంబంధించిన సమస్య వచ్చిందని ఆయన కొడుకు తెలిపారు.

ఇకపోతే మెల్ల కన్నును డాక్టర్లు చికిత్స ద్వారా సరి చేయవచ్చని చెప్పారని కానీ తనకు సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత మెల్ల కన్ను కలిసొచ్చిందని కళ్ళు చిదంబరం చెప్పడంతో అలాగే ఉంచేసారని తెలిపారు ఆయన కొడుకు.

Read more RELATED
Recommended to you

Latest news